News October 12, 2024

వింజమూరు: రోడ్డు ప్రమాదంలో బ్యాంక్ ఉద్యోగి మృతి

image

వింజమూరు మండలంలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఉదయగిరికి చెందిన APGB బ్యాంక్ ఉద్యోగి షేక్ ఖాజా రహంతుల్లా చనిపోయాడు. చాకలికొండలోని APGB బ్యాంకులో విధులు ముగించుకొని వస్తుండగా మార్గమధ్యలో గేదె అడ్డు వచ్చింది. దీంతో గేదెను తప్పించబోయి అదుపుతప్పి కింద పడ్డారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు.

Similar News

News November 6, 2024

ప్రమాదాల నివారణకు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి

image

పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు యాజమాన్యం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ హాల్లో పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు ముందు జాగ్రత్త చర్యలపై జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమలలో ప్రమాదం జరిగితే సంబంధిత తహశీల్దార్, ఆర్డీవోకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు.

News November 5, 2024

కాకాణితో సమావేశమైన ఎమ్మెల్సీ చంద్రశేఖర్

image

నెల్లూరు నగరంలోని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి నివాసంలో గురువారం ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సమావేశమయ్యారు. వారు పలు అంశాలపై చర్చించారు. కాకాణి గోవర్దన్ రెడ్డిని హౌస్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో జిల్లాలోనే పలువురు నాయకులు పాల్గొన్నారు.

News November 5, 2024

హైకోర్టులో కాకాణి పిటిషన్

image

సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఇటీవల టీడీపీ నేతలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో వెంకటాచలం, ముత్తుకూరు పోలీస్ స్టేషన్లలో కేసు నమోదయ్యాయి. వీటిని కొట్టేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. వీటిపై ఇవాళ జస్టిస్ వీఆర్‌కే కృపాసాగర్ విచారణ చేపట్టనున్నారు.