News November 19, 2025
విండ్రో కంపోస్టింగ్ యూనిట్‌ను పరిశీలించిన కమిషనర్, మేయర్

వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ వాజ్‌పేయి, మేయర్ గుండు సుధారాణితో కలిసి మంగళవారం బాలసముద్రంలోని విండ్రో కంపోస్టింగ్ యూనిట్‌ను సందర్శించారు. హాస్టళ్లు, హోటళ్లు, మార్కెట్ల నుంచి సేకరించిన ఆహార వ్యర్థాలతో కంపోస్ట్ తయారీకి జరుగుతున్న ట్రయల్ రన్‌ను వారు సమగ్రంగా పరిశీలించారు. పనులు మరింత వేగవంతంగా జరిగేలా సంబంధిత సిబ్బందికి సూచనలు జారీ చేశారు.
Similar News
News January 21, 2026
ఆదిలాబాద్ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగులకు ఆదిలాబాద్ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్, ఆర్‌ఆర్‌బీ, బ్యాంకింగ్, ఎస్‌ఎస్‌సీ పరీక్షల కోసం 5నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఏదైనా డిగ్రీతో కుటుంబ ఆదాయం రూ.3 లక్షలలోపు ఉన్నవారు అర్హులు. దరఖాస్తులు ఈనెల 30 వరకు http://tsstudycircle.co.in ద్వారా స్వీకరిస్తారు. ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 8న నిర్వహించనున్నారు.
News January 21, 2026
మద్దిరాల: రోడ్డు ప్రమాదంలో తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని మద్దిరాల తహశీల్దార్ కార్యాలయ రికార్డు అసిస్టెంట్ రాజేష్(22) దుర్మరణం చెందారు. ఎస్‌ఐ వీరన్న తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి కుంటపల్లి నుంచి మద్దిరాల వస్తుండగా రాజేష్ బైక్‌ను వేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 21, 2026
జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌గా వడ్డె వెంకట్ బాధ్యతల స్వీకరణ

అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా వడ్డె వెంకట్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన తనకు, జిల్లా స్థాయి ఉన్నత పదవి కల్పించినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని గ్రంథాలయాలను ఆధునీకరించి, విద్యార్థులకు, పాఠకులకు అందుబాటులో ఉండేలా అభివృద్ధి బాటలో నడిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు.


