News August 13, 2025
వికసిత్ భారత్ నిర్మాణంలో విద్యార్థులదే కీలక పాత్ర: కలెక్టర్

విజయవాడలోని మారిస్ స్టెల్లా కళాశాలలో హ్యూమన్ క్యాపిటల్ ఫర్ వికసిత్ భారత్ అనే అంశంపై సమగ్ర శిక్ష జిల్లా స్థాయి వర్క్‌షాప్ జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ లక్ష్మీశా హాజరై, మాట్లాడారు. వికసిత్ భారత్ నిర్మాణంలో విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తారన్నారు. పాఠశాల విద్య పునాదులను బలోపేతం చేసి, భవిష్యత్తు నాయకులను తయారు చేయడానికి ఉపాధ్యాయులు, ఇతర భాగస్వాములు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు.
Similar News
News March 14, 2026
NLG జిల్లావ్యాప్తంగా 37 మంది గైర్హాజరు

జిల్లా వ్యాప్తంగా 106 పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి తెలుగు పరీక్ష సుజావుగా జరిగినట్లు డీఈఓ భిక్షపతి తెలిపారు. 19,672 మంది విద్యార్థులకు గాను, 19,635 మంది విద్యార్థులు హాజరై 37 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. వీరిలో ముగ్గురు ప్రైవేటు విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. కలెక్టర్ బి. చంద్రశేఖర్ నాలుగు సెంటర్లను తనిఖీ చేశారని చెప్పారు.
News March 14, 2026
ANU దూరవిద్య ఉమ్మడి ప్రవేశ పరీక్షకు సర్వసిద్ధం

ANU దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో ఈనెల 15న జరిగే MBA, MCA ప్రవేశ పరీక్షకు సర్వం సిద్ధం చేసినట్లు CDE డైరెక్టర్ వంకాయలపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆన్‌లైన్లో దరఖాస్తులను ఆదివారం మధ్యాహ్నం 12గంటల లోపు పూర్తి చేసి పత్రాలను పరీక్ష కేంద్రంలో చూపించాలన్నారు. దరఖాస్తులు అందించని అభ్యర్థులు నేరుగా ఆధార్ కార్డు, అభ్యర్థి ఫోటో తోపాటు రూ.500 తత్కాల్ ఫీజు చెల్లించి పరీక్ష కేంద్రాలలో నేరుగా హాజరు కావచ్చన్నారు.
News March 14, 2026
విధులు నిర్వాహణలో నిర్లక్ష్యం వహించరాదు: SKLM కలెక్టర్

విధులు నిర్వాహణలో నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. పైపులైన్ కనెక్షన్లుపై ఎమినిటి సెక్రటరీస్, మున్సిపల్ అధికారులతో శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. నగరంలో జరుగుతున్న డ్రైనేజీ పనులు, మంచినీటి పైపులైన్లు పనుల్లో ఎక్కడ రాజీ పడకుండా వేగవంతం చేయాలని ఆదేశించారు. అధికారులు అలసత్వంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.


