News August 12, 2025

వికారాబాద్‌లో భారీ వర్షం.. మోమిన్‌పేట్‌లో అత్యధికం

image

వికారాబాద్ జిల్లాలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మోమిన్‌పేటలో 60.8 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. యాలాల్‌లో 30.0 మి.మీ., నవాబుపేటలో 21.8 మి.మీ., బంట్వారంలో 18.10 మి.మీ., కొడంగల్‌లో 16.30 మి.మీ., బషీరాబాద్, వికారాబాద్‌లో 10.90 మి.మీ., ధారూర్‌లో 10.0 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ వర్షం వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

Similar News

News March 7, 2026

ఇరాన్‌లో మరోసారి భూకంపం

image

US, ఇజ్రాయెల్ దాడులతో అట్టుడుకుతున్న ఇరాన్‌లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రత నమోదైంది. బందర్ అబ్బాస్‌కు 74 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు US జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈనెల 3న కూడా గెరాష్ నగర సమీపంలో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో <<19288652>>భూకంపం సంభవించడం<<>> తెలిసిందే.

News March 7, 2026

శ్రీకాకుళం: కేజీబీవీల్లో ప్రవేశాలకు వేళాయె!

image

పేద విద్యార్థులకు ప్రమాణాలతో విద్య అందిస్తున్న కేజీబీవీలో 6 వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. శ్రీకాకుళం జిల్లాలో 25 కేజీబీవీలు ఉన్నాయి. ఈనెల 12 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు. డ్రాప్ అవుట్, అనాధ, సింగిల్ పేరెంట్ బాలికలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

News March 7, 2026

సంతనూతలపాడు వద్ద రోడ్డు ప్రమాదం

image

సంతనూతలపాడు ఎండ్లూరు డొంక వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. భారీ గ్రానైట్ రాళ్లతో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో ముందు భాగం దెబ్బ తిన్నది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.