News November 6, 2025

వికారాబాద్‌లో 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం

image

వికారాబాద్ పరిధి శివారెడ్డిపేటలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ఈరోజు 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్‌ను డీసీఓ సాయిలత ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా వచ్చిన ఆమె అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రమాదేవి, డాక్టర్ నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News January 18, 2026

హైదరాబాద్ మళ్లీ ‘ఆమె’దే!

image

త్వరలో ఎన్నికలు జరగనున్న జీహెచ్ఎంసీ కొత్త పాలక మండలిలో మేయర్‌గా మరోసారి మహిళే ఎన్నిక కానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థల ఛైర్మన్లు, మేయర్లకు శనివారం లాటరీ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. పది మున్సిపల్ కార్పొరేషన్లకు గానూ జీహెచ్ఎంసీకి మహిళ (జనరల్) రిజర్వు కావడంతో రాబోయే పాలకమండలిలోనూ హైదరాబాద్‌లో మహిళే చక్రం తిప్పనున్నారు.

News January 18, 2026

కర్ణుడి దానగుణం: మానవత్వమే పరమార్థం

image

మహాభారత యుద్ధంలో కర్ణుడి దానపుణ్యమే అతడికి రక్షగా నిలిచింది. చివరి క్షణంలో కృష్ణుడు అడిగినప్పుడు కర్ణుడు తన పుణ్యఫలాన్ని కూడా దానమిచ్చాడు. వరం కోరమని అడగ్గా.. మరుజన్మలోనూ సాయం చేసే హృదయాన్నే కోరుకున్నాడు. ముక్తి కోసం దేవుడిని వెతకక్కర్లేదని, తోటివారికి సాయపడే గుణం ఉంటే ఆ దేవుడే మనల్ని చేరుకుంటాడని ఈ కథ నిరూపిస్తోంది. పరోపకారమే నిజమైన దైవారాధనని కర్ణుడి జీవితం చాటిచెబుతోంది.

News January 18, 2026

C-DOTలో సైంటిస్ట్ పోస్టులు

image

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్(<>C-DOT<<>>) 10 సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 16 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/BTech, MSc, ME/MTech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. స్కిల్/ రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cdot.in.