News February 7, 2025

వికారాబాద్: అప్పుడే మండుతున్న ఎండలు

image

గత కొన్నిరోజులుగా వికారాబాద్ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న జిల్లాలో 35.2 డిగ్రీలు నమోదైంది.  ఫిబ్రవరి మొదటి వారంలోనే పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా రికార్డు అవుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే.. మునుముందు పరిస్థితి ఎలా ఉంటుందో అని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పొద్దున, సాయంత్రం వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ పగటి పుట ఉష్ణోగ్రతలు సుర్రుమంటున్నాయి. 

Similar News

News February 17, 2026

మెదక్‌లో 25 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పాగా

image

మెదక్ పురపాలక సంఘం పీఠాన్ని 25 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 2000లో జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కొండన్ సావిత్రి సురేందర్ గౌడ్ గెలుపొందిన విషయం తెలిసిందే. తర్వాత జరిగిన 3 ఎన్నికల్లో ఒకసారి టీడీపీ (ఉమ్మడి రాష్ట్రం) 2014, 2020లో బీఆర్ఎస్ పాగా వేసింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో 32 స్థానాలున్న బల్దియాలో 14 గెలుపొందినా కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది.

News February 17, 2026

మునుగోడు: ‘పదవులు శాశ్వతం కాదు.. అభివృద్ధే ముఖ్యం!’

image

మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చండూరు మున్సిపాలిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పదవుల కంటే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే ముఖ్యమని ప్రజాప్రతినిధులకు హితబోధ చేశారు. పదవులు అనేవి శాశ్వతం కావని, ప్రజలు నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించినందుకు వారి అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు.