News March 12, 2025
వికారాబాద్: ఆరుగురిపై కుక్కల దాడి

వికారాబాద్ మునిసిపల్ పరిధిలోని గిరిగిట్ పల్లిలో కుక్కలు ఆరుగురిపై దాడి చేసి గాయపరిచాయి. పనుల మీద బయటకు వెళ్తే చాలు కుక్కలు ఎగబడుతున్నాయని స్థానికులు తెలిపారు. కుక్కల బెడద ఉందని చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
Similar News
News February 16, 2026
17న డీ వార్మింగ్ డే: GNT DMHO

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం (డీ వార్మింగ్ డే)ను ఈ నెల 17వ తేదీన నిర్వహిస్తున్నట్లు DMHO విజయ లక్ష్మి తెలిపారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంపై సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని అంగన్వాడీలు, పాఠశాలలు, కళాశాలల్లో 17వ తేదీన ఉచితంగా ఇవ్వబడే అల్బెండజోల్ 400 మిల్లీ గ్రాముల మాత్ర ద్వారా నులిపురుగుల సంక్రమణను సులభంగా నిర్మూలించవచ్చన్నారు.
News February 16, 2026
మహిళలూ ఒంటరిగా ప్రయాణిస్తున్నారా?

ప్రస్తుతకాలంలో వృత్తి, ఉద్యోగాల కారణంగా మహిళలు క్యాబ్స్‌లో ప్రయాణించడం ఎక్కువైంది. ఇలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. డ్రైవర్ ఐడీ, లైసెన్స్ ప్లేట్ మీరు బుక్ చేసిన డేటాతో సరిపోలాలి. ట్రిప్ వివరాలు, లైవ్ ట్రాకింగ్ సన్నిహితులకు పంపడం మంచిది. గుర్తింపు ఉన్న క్యాబ్ సర్వీసులనే ఎంచుకోవాలి. పరిసరాలు గమనిస్తూ అలర్ట్‌గా ఉండాలి. వెనుక సీట్‌లోనే కూర్చోవాలి. తెలియనివారికోసం డోర్లు తెరవకూడదు.
News February 16, 2026
ఇలా అయితే ఆక్వా మనుగడ కష్టమే!(1/3)

ట్రేడర్ల చేతిలో, సిండికేట్ల చేతిలో నిలువునా దోపిడీకి గురవుతున్న ఆక్వా రైతులకు రాయితీలు కూడా అందని ద్రాక్షగానే మిగిలాయి. కనీసం ఫ్యాన్లు, ఏరియేటర్లు వంటి వాటిని కూడా రైతులకు రాయితీపై అందించడం లేదు. రూ.1.50 యూనిట్ విద్యుత్ ఛార్జ్ అని కేవలం అవి కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయడం పట్ల సాగు చేసే అందరి రైతులకు ఉపయోగపడటం లేదు. చెరువుల అనుమతుల విషయంలోనూ ప్రభుత్వాలు ఏమాత్రం రాయితీలు అందించిన పాపాన పోవడం లేదు.


