News February 8, 2025

వికారాబాద్: ఉరేసుకుని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య 

image

ఉరేసుకుని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. సీఐ భీమ్ కుమార్ తెలిపిన వివరాలు.. కుల్కచర్ల మండలం ముజాహిద్‌పూర్ వాసి సత్యనారాయణ వికారాబాద్‌లోని గాంధీ కాలేజీ వద్ద అద్దెకు ఉంటున్నారు. ఆయన కూతురు జ్యోతి(21) బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. కుటుంబీకులు ఊరెళ్లగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో జ్యోతి ఉరేసుకుని చనిపోయింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. 

Similar News

News February 12, 2026

కృష్ణా: పోలీసులకు ఫైరింగ్ ప్రాక్టీస్.. ఏఆర్ సిబ్బందికి శిక్షణ

image

ఏఆర్ పోలీస్ అధికారులకు, సిబ్బందికి నిర్వహిస్తున్న వార్షిక మొబిలైజేషన్‌లో భాగంగా మంగినపూడి బీచ్ వద్ద గల ఫైరింగ్ రేంజ్‌లో గురువారం ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో సిబ్బంది తమ గురిని పరీక్షించుకున్నారు. విధి నిర్వహణలో ఆయుధాల వినియోగంపై పట్టు సాధించేందుకు ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందని అధికారులు తెలిపారు.

News February 12, 2026

మహాశివరాత్రి ఉత్సవాలకు పటిష్ఠ భద్రత: ఎస్పీ

image

మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ సోపిరాల, కొత్తపాలెం గ్రామాల్లోని దేవాలయాలను సందర్శించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు, బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా ఉంచుతామని, రైల్వే ట్రాక్ దాటే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శాఖల సమన్వయంతో వేడుకలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

News February 12, 2026

ఏర్పేడు: ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తులు

image

ఏర్పేడు వద్ద ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) తిరుపతిలో ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ -01 పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. మాస్టర్స్/ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కామర్స్, అనుభవం కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. ఇతర వివరాలకు https://www.iittp.ac.in/Outsourced_Positions వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 15.