News August 23, 2025
వికారాబాద్ ఎస్పీకి నౌకాదళం ప్రశంసాపత్రం

వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి చేసిన విశేష సేవలకు గాను భారత నౌకాదళం నుంచి ప్రశంసాపత్రం లభించింది. భారత నౌకాదళ ఉపఅధిపతి, వైస్ అడ్మిరల్ తరుణ్ సోబ్తిని ఈ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. నారాయణ రెడ్డి విధి నిర్వహణలో చూపించిన అంకితభావం, నిబద్ధత, వృత్తి నైపుణ్యానికి గౌరవం దక్కడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News January 20, 2026
హైదరాబాద్‌లో 80 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

HYDలోని CSIR-CCMB 80 పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గలవారు JAN 27 -FEB 23 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని మార్చి 2 వరకు పోస్ట్ చేయవచ్చు. టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్‌కు గరిష్ఠ వయసు 28ఏళ్లు కాగా, టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు 30ఏళ్లు. టెక్నీషియన్‌కు నెలకు రూ.39,545, tech. assist.కు రూ.72,240, tech. ఆఫీసర్‌కు రూ.90,100 చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.ccmb.res.in/
News January 20, 2026
ఆదిలాబాద్: ఓపెన్ స్కూల్ పరీక్షా ఫీజు గడువు పెంపు

ఉమ్మడి జిల్లాలో మార్చి, ఏప్రిల్లో నిర్వహించే ఓపెన్ స్కూల్ పరీక్షా ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు జిల్లా అదనపు కలెక్టర్, ఇన్ఛార్జ్ విద్యాశాఖ అధికారి రాజేశ్వర రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అపరాధ రుసుము రూ.50తో ఈనెల 25వ తేదీ వరకు, తత్కాల్ ఫీజు చెల్లించేందుకు ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. అభ్యర్థులు ఈ గడువు పొడిగింపును ఉపయోగించుకోవాలన్నారు.
News January 20, 2026
డాక్టర్లు నిర్లక్ష్యంగా ఉండరాదు: మంత్రి మండిపల్లి

రాయచోటి నియోజకవర్గంలోని పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి మంగళవారం ఆయన హాజరయ్యారు. ఆసుపత్రిలో అన్ని విభాగాలకు పరికరాలు సమకూరుస్తామన్నారు. పేదలకు వైద్యం చేయడంలో డాక్టర్లు నిర్లక్ష్యం చేయరాదన్నారు. కార్యక్రమంలో వైద్యులు పాల్గొన్నారు.


