News May 7, 2025
వికారాబాద్ జిల్లాలో టెండర్ల ఆహ్వానం

వికారాబాద్ జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించి అన్ని ఔట్సోర్సింగ్ సర్వీసులు ఏర్పాటు చేయడం నిమిత్తం రిజిస్ట్రేషన్ అయి ఉన్న ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు సీల్ టెండర్లు కోరుతున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. టెండర్ల డాక్యుమెంట్లను జిల్లా ఉపాధి కల్పన అధికారి నుంచి మే 6లోగా కార్యాలయ పని దినాల్లో పొందవచ్చని కలెక్టర్ తెలిపారు. ఏప్రిల్ 28 నుంచి మే 6వ వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు.
Similar News
News February 19, 2026
రూ.50Kకే మ్యాక్‌బుక్ ఎయిర్?

మార్చ్ 4న జరిగే కంపెనీ ఈవెంట్‌లో లోకాస్ట్ మ్యాక్‌బుక్‌ను యాపిల్ లాంఛ్ చేయనుందని సమాచారం. ప్రస్తుతం మ్యాక్ బుక్ సిరీస్ ల్యాప్‌టాప్‌లలో ఎయిర్ వర్షన్ తక్కువ ధర. అయితే అది కూడా రూ.1లక్షకు సమీపంలో ఉండగా, వచ్చే నెలలో రిలీజ్ అయ్యే డివైజ్ ధర రూ.50వేలు ఉండొచ్చని టెక్ లీక్స్ చెబుతున్నాయి. ఇందులో A18 చిప్, ai సహా పలు ఫీచర్లు ఉంటాయని సమాచారం. ఇక ఇదే ఈవెంట్‌లో 17e మొబైల్‌నూ యాపిల్ రిలీజ్ చేయనుంది.
News February 19, 2026
అనంతపురంలో మహిళ హత్య.. ఆరుగురు అరెస్ట్

అనంతపురం కొవ్వూరు నగర్‌లో జరిగిన గౌసియా బేగమ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆరుగురు నిందితులు అరెస్ట్ చేసినట్లు CI రాజేంద్రనాథ్ తెలిపారు. ఆయన వివరాల మేరకు.. బేగమ్ కుమారుడు ఇమ్రాన్ ఖాన్ తన భార్యతో సన్నిహితంగా ఉన్నాడనే అనుమానంతో మల్కి జాఫర్ అతడిపై దాడికి దిగారు. అడ్డుగా వచ్చిన బేగమ్ గాయపడి మరణించారు. ఈ ఘటనలో ఆరుగురు నిందితులను చేయగా పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు జాఫర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
News February 19, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


