News February 16, 2025

వికారాబాద్ జిల్లాలో మండుతున్న ఎండలు

image

వికారాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఆదివారం 36.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పనులపై బయటకు వెళ్లేవారు, కూలీలు, రైతులు జాగ్రత్తగా ఉండాలన్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు ఎక్కువగా బయటికి రాకుండా చూసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే 3 నెలలు ఎలా ఉంటుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Similar News

News April 14, 2026

ADB: జీవితం అంటే ఓటమి కాదు.. మరో అవకాశం..!

image

విద్యార్థులారా..! కాగితం మీద పడ్డ ‘ఫెయిల్’ ముద్ర, నీ నుదుటి రాతను మార్చలేదు. పదో తరగతిలో తడబడిన సచిన్, ప్రపంచం కొలిచే శిఖరమయ్యాడు.. నువ్వు విసిరేసిన ప్రాణం, నీ కన్నవారికి తీరని శోకమవుతుంది. ​ఓటమి అనేది ముగింపు కాదు.. నిన్ను నువ్వు దిద్దుకునే ఒక మలుపు..!. ఇంటర్ రిజల్ట్స్ తర్వాత ఉట్నూర్, నర్సాపూర్, ఖానాపూర్‌లో విద్యార్థుల ఆత్మహత్యలు ఉమ్మడి ఆదిలాబాద్‌ను కలవరపెట్టాయి. ఇలా చేయొద్దు.

News April 14, 2026

గ్రామాల్లోనూ అన్న క్యాంటీన్లు.. రేపే ప్రారంభం

image

AP: ప్రస్తుతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఉన్న అన్న క్యాంటీన్లు గ్రామాల్లోనూ అందుబాటులోకి రానున్నాయి. ఒకేసారి 62 క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. రేపు పల్నాడు(D) ధరణికోటలో సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్‌ను ఓపెన్ చేసి పేదలతో భోజనం చేస్తారు. కాగా పట్టణాల్లోని 207 క్యాంటీన్లలో ప్రభుత్వం రూ.5కే ఫుడ్ అందిస్తోంది. రోజుకు సగటున 2.10 లక్షల మంది ఆకలి తీర్చుకుంటున్నారు.

News April 14, 2026

తెలంగాణ ఫలితాల్లో సిక్కోలు వలస కూలీ బిడ్డ సంచలనం

image

వజ్రపుకొత్తూరు(M) గుణుపల్లికి చెందిన వలస కూలీ కుమార్తె గుండుపల్లి స్వాతి తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో (MPC) 470కి 468 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్‌గా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు ఈ మార్కులు సాధించగా, అందులో స్వాతి ఒకరు కావడం విశేషం. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటిన స్వాతిని ఉద్దాన ప్రజలు అభినందిస్తున్నారు. ఈ ఘనత జిల్లాకు గర్వకారణమని హర్షం వ్యక్తం చేస్తున్నారు.