News August 20, 2025
వికారాబాద్ జిల్లాలో రేషన్ కార్డుల దందా..!

అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు అందజేస్తుంది. కాగా, వికారాబాద్ జిల్లాలో రేషన్ కార్డుల మంజూరులో అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త కార్డు కావాలన్నా, పేరు చేర్చాలన్నా డబ్బులు ఇస్తేనే పనులు అవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. రేషన్ కార్డులను సంక్షేమ పథకాలకు ప్రామాణికం కావడంతో వీటికి డిమాండ్ పెరిగింది. అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News January 17, 2026
KGHలో ఆకస్మిక తనిఖీ చేపట్టిన కలెక్టర్

KGHలో వైద్యం కోసం వచ్చే రోగులను ఎవరైనా డబ్బులు అడిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ హెచ్చరించారు. శనివారం KGHలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ట్రీట్‌మెంట్‌కు డబ్బులు అడిగినట్టు రోగి బంధువులు తనకు తెలిపారని, ఈ విషయంపై విచారణ చేపట్టాలని సూపరిండెంటెంట్‌ను ఆదేశించారు.
News January 17, 2026
పాలమూరు తొలి మేయర్‌గా బీసీ మహిళ

మహబూబ్ నగర్ కార్పొరేషన్ రిజర్వేషన్ ఖరారు అయింది. రిజర్వేషన్లలో మేయర్ స్థానాన్ని బీసీ మహిళగా ఖరారు చేస్తూ అధికారులు ప్రకటించారు. దీంతో మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా అప్ గ్రేడ్ అయిన తర్వాత తొలి మేయర్‌గా బీసీ మహిళ అందాల ఎక్కబోతుంది. కాగా పాలమూరు మేయర్ స్థానాన్ని బీసీలకు కేటాయించడంతో బీసీ సంఘాలు, మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News January 17, 2026
మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఖరారు

TG: రాష్ట్రంలో 121 మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. బీసీలకు 38, SC 17, ST 5, జనరల్ కి 61 స్థానాలు కేటాయించారు. ఎస్టీ కేటగిరీలో కల్లూరు, భూత్పూర్, మహబూబాబాద్, కేసముద్రం, ఎల్లంపేట్ ఉన్నాయి. ఎస్సీ జనరల్ కేటగిరీలో స్టేషన్ ఘన్‌పూర్, జమ్మికుంట, డోర్నకల్, లక్షెట్టిపేట, మూడుచింతలపల్లి, నందికొండ, మొయినాబాద్, కోహిర్, హుస్నాబాద్ ఉన్నాయి. పూర్తి వివరాలకు పైన ఫొటోలను స్లైడ్ చేయండి.


