News October 8, 2025
వికారాబాద్: పాఠశాల గదిలో పాములు

యాలల్ మండలం అక్కంపల్లి ప్రాథమిక పాఠశాలలో భారీ వర్షానికి ఐదో తరగతి గది శిథిలావస్థకు చేరింది. దీంతో ఆ గదిలో మూడు పాములు ప్రత్యక్షమవడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఉపాధ్యాయులు వెంటనే వారిని మరో గదిలోకి పంపించారు. గ్రామస్థుల సాయంతో రెండు పాములను పట్టుకున్నారు. అధికారులు తక్షణమే శిథిలమైన గదికి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Similar News
News January 12, 2026
అన్నమయ్య జిల్లాలో పొంచి ఉన్న ప్రమాదం

జిల్లాలోని భూగర్భ జలాల్లో యురేనియం స్థాయిలు ప్రమాదకరంగా పెరిగినట్లు సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ (CGWB) 2025 నివేదిక వెల్లడించింది. గాలివీడు, బోరెడ్డిగారిపల్లి, బసిని కొండ, చిన్నమండ్యం, సానిపాయ్, చింతపర్తి గ్రామాల్లో యురేనియం సాంద్రత 30 PPB కంటే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ పరిస్థితి తాగునీరు, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
News January 12, 2026
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓ దమ్మపేట: కారు ఢీకొని మహిళ మృతి
✓ పాల్వంచ: గంజాయి తరలిస్తున్న నలుగురు అరెస్ట్
✓ కొత్తగూడెం కార్పొరేషన్ ఓటరు జాబితా విడుదల
✓ భద్రాద్రి డీసీసీ అధ్యక్షురాలిగా దేవి ప్రసన్న ప్రమాణం
✓ కొత్తగూడెం: పెండింగ్ వేతనాలు చెల్లించాలి: ఐఎఫ్టీయూ
✓ కొత్తగూడెం బీఆర్ఎస్‌లో వర్గాలు లేవు: ఎంపీ వద్దిరాజు
✓ జిల్లా వ్యాప్తంగా వివేకానంద జయంతి వేడుకలు
News January 12, 2026
వరంగల్: స్వాతంత్ర్య సమరయోధురాలు కన్నుమూత

వరంగల్ పరిధి గిర్మాజిపేటకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు దివంగత వన్నాల పెద్ద వీరన్న సతీమణి, స్వాతంత్ర్య సమరయోధురాలు వన్నాల లక్ష్మి ముదిరాజ్ (100) అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె దేశం కోసం చేసిన పోరాటం, దేశభక్తి స్ఫూర్తి, సేవా విలువలను కుటుంబ సభ్యులు, స్థానికులు గుర్తు చేస్తున్నారు. అభిమానులు, పలువురు నాయకులు ఘనంగా నివాళులర్పించారు.


