News October 7, 2025
వికారాబాద్: మైనార్టీలకు కాంగ్రెస్‌లో సముచిత స్థానం లేదు: మాజీ ఎమ్మెల్యే

మైనార్టీలకు కాంగ్రెస్‌లో సముచిత స్థానం లేదని, కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తుందని BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం ఎన్నెపల్లిలోని BRS భవన్‌లో పార్టీ పట్టణ మైనారిటీ నాయకులతో సమావేశం అయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ముస్లిం మైనారిటీలు సిద్ధంగా ఉన్నారన్నారు. పట్టణ మైనార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
Similar News
News January 13, 2026
కేంద్ర నిర్ణయాన్ని స్వాగతించిన చద్దా

క్విక్ కామర్స్ సంస్థల ‘10 నిమిషాల డెలివరీ’ విధానాన్ని కేంద్రం <<18845524>>తొలగించడంపై<<>> ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా సంతోషం వ్యక్తం చేశారు. ‘సత్యమేవ జయతే.. అంతా కలిస్తేనే ఈ విజయం సాధ్యమైంది’ అంటూ X వేదికగా ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇది డెలివరీ బాయ్స్‌పై ఉండే ఒత్తిడిని తగ్గిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో పార్లమెంటులో కూడా గిగ్ వర్కర్ల భద్రతపై ఆయన <<18483406>>గళమెత్తి<<>> వారికి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.
News January 13, 2026
సమ్మక్క-సారక్క పలారముల్లో..!

ఉమ్మడి వరంగల్‌లో ప్రస్తుతం ఏ గల్లీకి వెళ్లినా ‘సమ్మక్క-సారక్క పలారముల్లో..!’ అని వినిపిస్తోంది. మేడారం జాతరకు వెళ్లడానికి ముందు కోడి, నిలువెత్తు బంగారం(బెల్లం)తో ఇంట్లోనే తల్లులకు ముందస్తు మొక్కులు చెల్లించడం ఆనవాయితీ. ఆ తర్వాతే మేడారం వెళ్తారు. ఇంతకీ పలారం అంటే ఏంటనుకుంటున్నారా? కొబ్బరి కుడుక, బెల్లం, చెక్కర కలిపి చుట్టు పక్క వారిని పిలిచి ‘సమ్మక్క-సారక్క పలారం’ అని పంచిపెడతారు. ఇలా మీరు చేశారా?
News January 13, 2026
కరీంనగర్: సమ్మక్క-సారక్క పలారముల్లో..!

ఉమ్మడి కరీంనగర్‌లో ప్రస్తుతం ఏ గల్లీకి వెళ్లినా ‘సమ్మక్క-సారక్క పలారముల్లో..!’ అని వినిపిస్తోంది. మేడారం జాతరకు వెళ్లడానికి ముందు కోడి, నిలువెత్తు బంగారం(బెల్లం)తో ఇంట్లోనే తల్లులకు ముందస్తు మొక్కులు చెల్లించడం ఆనవాయితీ. ఆ తర్వాతే మేడారం వెళ్తారు. ఇంతకీ పలారం అంటే ఏంటనుకుంటున్నారా? కొబ్బరి కుడుక, బెల్లం, చెక్కర కలిపి చుట్టుపక్క వారిని పిలిచి ‘సమ్మక్క-సారక్క పలారం’ అని పంచిపెడతారు. ఇలా మీరు చేశారా?


