News March 14, 2025

వికారాబాద్: యువత చట్టాలపై అవగాహన కల్పించుకోవాలి: జడ్జి 

image

యువత చట్టాలపై అవగాహన కల్పించుకోవాలని జిల్లా సేవాధికార సంస్థ సెక్రటరీ జడ్జి శీతాల్ తెలిపారు. వికారాబాద్ పట్టణంలోని శ్రీ అనంతపద్మనాభ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జి శీతాల్ మాట్లాడుతూ.. చట్టాలపై అవగాహన కల్పించుకుని బాల్యవివాహాల నిర్మూలనకు యువత కృషి చేయాలన్నారు.

Similar News

News February 18, 2026

సంగారెడ్డి: ‘శివాజీ జయంతి శాంతియుతంగా నిర్వహించాలి’

image

ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి వేడుకలను శాంతియుతంగా నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ర్యాలీలు నిర్వహించేందుకు ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. సూచించిన మార్గాల్లోనే ర్యాలీ నిర్వహించాలని, రహదారులు దిగ్బంధం చేయకుండా, ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా సమయపాలన పాటిస్తూ జాగ్రతలు తీసుకోవాలని సూచించారు.

News February 18, 2026

ఇది కాంగ్రెస్ ప్రభుత్వ కక్షసాధింపు చర్య: బాల్కొండ ఎమ్మెల్యే

image

ప్రతిపక్ష నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టును ఖండిస్తూ బుధవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని, అక్రమాలను అడ్డుకోవాలని ప్రశ్నించిన బాల్క సుమన్‌ను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు.

News February 18, 2026

సిద్దిపేట: వ్యవసాయ ఆర్థిక శాస్త్రంలో సౌమ్యకు డాక్టరేట్

image

సిద్దిపేట పట్టణానికి చెందిన వ్యాపారవేత్త చీల లక్ష్మణ్-పద్మ దంపతుల కుమార్తె చీల సౌమ్య అరుదైన గౌరవం అందుకున్నారు. ప్రతిష్టాత్మక ఐఏఆర్ఐ నుంచి వ్యవసాయ ఆర్థిక శాస్త్రంలో ఆమె పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టరేట్ పట్టా పొందారు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి చేరుకున్నానని సౌమ్య ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. ఆమె ప్రతిభను స్థానికులు, కుటుంబ సభ్యులు అభినందించారు.