News January 30, 2025

వికారాబాద్: రైలు పట్టాలపై వ్యక్తి ఆత్మహత్య!

image

రైలు పట్టాలపై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మోమిన్‌పెట్ PS పరిధిలో జరిగింది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. గోపాల్ రెడ్డి (65) కుటుంబ కలహాల వల్ల మనస్తాపానికి గురై అలీపూర్ గ్రామ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 7, 2025

కోటప్పకొండ జాతరకు పటిష్ట బందోబస్తు: ఎస్పీ

image

ఫిబ్రవరి 26న జరిగే కోటప్పకొండ తిరుణాళ్లకు ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. కొండకు వచ్చే అన్ని మార్గాలలో రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండాచర్యలు తీసుకుంటామన్నారు. పార్కింగ్ కుముందస్తు ప్రత్యేక ప్రదేశాలు ఎంపిక చేస్తామన్నారు. ప్రభలు వద్ద బందోబస్తు ఉంటుందన్నారు. పోలీస్ అధికారులున్నారు

News February 7, 2025

రేపు 11 కేంద్రాల్లో జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్

image

జవహర్ నవోదయ విద్యాలయంలో తొమ్మిదవ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్(JNVST) వరంగల్ జిల్లాలోని 11 సెంటర్లలో శనివారం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నవోదయ పరీక్ష నిర్వహిస్తున్న ఈ 11 పాఠశాలలకు జిల్లా కలెక్టర్ & డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ రేపు సెలవు ప్రకటించారు.

News February 7, 2025

గ్రేట్.. ఆరు నెలల బోనస్ ఇచ్చిన స్టార్టప్

image

ఉద్యోగుల విధేయతను గౌరవిస్తూ ఓ కంపెనీ వారికి 6 నెలల జీతాన్ని బోనస్‌గా ఇచ్చింది. TNలోని కోయంబత్తూరులో ఉన్న AI స్టార్టప్ ‘KOVAI.CO’ను శరవణ కుమార్ స్థాపించారు. మొత్తం 140 మంది ఉద్యోగులుండగా, వారికి రూ.14 కోట్లు బోనస్‌గా ఇచ్చారు. ‘స్టార్టప్‌లలో పనిచేసేందుకు ఎవరూ మొగ్గుచూపారు. మూడేళ్లు మాతో పనిచేస్తే 2025 జనవరి జీతంలో ఆరు నెలల బోనస్ ఇస్తానని ప్రకటించి ఆ మాటను నిలబెట్టుకున్నా’ అని శరవణ కుమార్ తెలిపారు.

error: Content is protected !!