News March 13, 2025
వికారాబాద్: విషాదం.. యువకుడి మృతి

వికారాబాద్ జిల్లా దోమ మండలం మైలారం వద్ద జరిగిన <<15741649>>రోడ్డు ప్రమాదంలో<<>> మోత్కూర్ గ్రామానికి చెందిన సాయికుమార్, ధన్‌రాజ్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. వారిని స్థానికులు పరిగి ప్రభుత్వాసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వికారాబాద్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ధన్‌రాజ్ ఈరోజు తెల్లవారుజామున మరణించాడని, సాయి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
Similar News
News February 19, 2026
వరుణ్.. నువ్వో వరం!

టీ20ల్లో టీమ్ ఇండియాకు వరుణ్ చక్రవర్తి వరంలా మారారు. గత 29 టీ20ల్లో 28 మ్యాచుల్లో అతడు వికెట్లు పడగొట్టడం విశేషం. ఒక్క మ్యాచులో మాత్రమే వికెట్లు తీయలేదు. కీలక సమయాల్లో తన మిస్టరీ బంతులతో బ్యాటర్లను బోల్తా కొట్టించడం వరుణ్ స్పెషల్. ఈ ప్రపంచకప్‌లోనూ మిగతా బౌలర్లు వికెట్లు తీయలేక ఇబ్బందులు పడుతుంటే వరుణ్ వరుసగా వికెట్లు తీస్తూ భారత్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.
News February 19, 2026
బాల్క సుమన్ గొడవ క్రియేట్ చేశారు: వివేక్

క్యాతన్‌పల్లిలో బాల్క సుమన్ అరెస్ట్‌ను ఖండించిన ఎమ్మెల్యే హరీశ్ రావుపై మంత్రి వివేక్ ఫైర్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికకు వస్తున్న ఎంపీ, మంత్రి వాహనాలపై రాళ్లు రువ్విన వారికి ఎలా సపోర్ట్ చేస్తారని నిలదీశారు. అసలు అక్కడ గొడవ జరగలేదని.. సుమన్ కావాలని గొడవ క్రియేట్ చేశారని మండిపడ్డారు. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకోలేదని, కావాలనే తమపై లేనిపోని నిందలు వేస్తున్నారని ఆగ్రహించారు.
News February 19, 2026
భారీగా తగ్గిన రష్యన్ ఆయిల్ దిగుమతులు

భారత్ చమురు దిగుమతుల్లో రష్యా వాటా భారీగా తగ్గింది. ఒకప్పుడు 40% ఉన్న షేర్ ఇప్పుడు 21.1%కు పడిపోయింది. జనవరిలో రోజుకు 1.1 మిలియన్ బ్యారెళ్ల చమురును మాత్రమే దిగుమతి చేసుకుంది. 2022 నవంబరు తర్వాత ఇంత తక్కువ దిగుమతులు చేసుకోవడం ఇదే తొలిసారి. మార్చిలో ఈ దిగుమతి రోజుకు 8లక్షల బ్యారెళ్లకు పడిపోవచ్చని అంచనా. మరోవైపు జనవరి చమురు దిగుమతుల్లో మిడిల్ ఈస్ట్ వాటా దాదాపు 55%గా నమోదైంది.


