News April 29, 2024

విజయగనరంలో 92 మంది పోటీ

image

నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. విజయనగరం పార్లమెంటు స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 77 మంది పోటీలో ఉన్నారు. VZM అసెంబ్లీ స్థానంలో 15 మంది అభ్యర్థులు, ఎస్.కోటలో 12, నెల్లిమర్లలో 12, గజపతినగరంలో 13, చీపురుపల్లిలో 7, రాజాంలో 10, బొబ్బిలిలో 8 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 7 అసెంబ్లీ స్థానాల నుంచి 7 అభ్యర్థులు తప్పుకున్నారు.

Similar News

News April 16, 2026

విజయనగరం: సమగ్ర శిక్షా కార్యాలయంలో ఉద్యోగాల భర్తీ

image

విజయనగరం సమగ్ర శిక్షా కార్యాలయంలో ఖాళీగా ఉన్న 8 సెక్టోరల్, అసిస్టెంట్ సెక్టోరల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DEO&APC మాణిక్యం నాయుడు తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు దీనికి అర్హులన్నారు. ఏప్రిల్ 22 సా.5 గంటల లోపు జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. vizianagaram.ap.gov.in వెబ్‌సైట్‌‌లో సంబధిత వివరాలు ఉన్నాయని చెప్పారు.

News April 16, 2026

విజయనగరంలో రేపు జాబ్ మేళా..

image

విజయనగరం MR కాలేజీలో ఈనెల 17న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వహీదా గురువారం తెలిపారు. ఉ.10.30 గంటలకు ప్రారంభమయ్యే మేళాలో టాటా ఎలక్ట్రానిక్స్, మెడ్‌ప్లస్, క్వెస్ కార్ప్, అపోలో ఫార్మసీ సంస్థలు పాల్గొంటాయని వెల్లడించారు. టెన్త్ టు డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులై, 18-30 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.12,600-రూ.20,000 పైగా వేతనం లభిస్తుందని తెలిపారు.

News April 16, 2026

VZM: అవినీతి..రూ.20 లక్షల గోల్ మాల్

image

బాడంగిలోని పలు గ్రామాలలో ఉపాధి హామీ పనులలో అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీలలో గుర్తించారు. సామాజిక తనిఖీ ప్రజా వేదికను ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. మూడు క్లస్టర్లలో మస్టర్లు దిద్దుబాటు చేసి, పనికి రాకుండానే వచ్చినట్లు మస్టర్లు వేసి రూ. 20లక్షల వరకు స్వాహా చేసినట్లు డీఆర్పీలు వెల్లడించారు. అవినీతి సొమ్ము రికవరీ చేయాలని జిల్లా అధికారులు ఆదేశించారు.