News September 13, 2025

విజయనగరంలో నేడు జాతీయ లోక్ అదాలత్

image

విజయనగరం జిల్లా కోర్టులో శనివారం జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు, ప్రజలు సద్వినియోగపరచుకోవాలని జిల్లా జడ్జి బబిత కోరారు. విజయనగరం, పార్వతీపురం జిల్లాల వ్యాప్తంగా 19 లోకదాలత్ బెంచీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, భూ తగాదా కేసులు, కుటుంబ తగాదాలు, చెక్‌ బౌన్స్ కేసులను ఇరు పార్టీల అనుమతితో రాజీ మార్గంలో శాశ్వత పరిష్కారం చేసుకోవచ్చు అన్నారు.

Similar News

News December 9, 2025

స్వరాష్ట్ర కలను సోనియా సాకారం చేశారు: రేవంత్

image

TG: సరిగ్గా ఇదే రోజున 2009లో తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చేసిన ప్రకటన రాష్ట్ర ప్రజలకు సంతోషాన్నిచ్చిందని సీఎం రేవంత్ అన్నారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్వరాష్ట్ర కలను సోనియా సాకారం చేశారన్నారు. ఆ కారణంగానే ఈ రోజున తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో ఆయన వర్చువల్‌గా పాల్గొన్నారు.

News December 9, 2025

కడప SPని ఆశ్రయించిన ప్రేమ జంట.!

image

తమను చంపేస్తామని తల్లిదండ్రులు బెదిరిస్తున్నారని ఓ ప్రేమజంట కడప SPని కలిసింది. వేల్పులకి చెందిన సుష్మాన్ బేగం, కొండూరుకి చెందిన మనోహర్ ప్రేమించుకున్నారు. అనంతరం చీమలపెంట వద్ద ఓ శివాలయంలో వివాహం చేసుకున్నారు. తరువాత పోలీసులను ఆశ్రయించగా తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు. వీరి కులాలు వేర్వేరు కావడంతో వారి తల్లిదండ్రులు వీరి ప్రేమను ఒప్పుకోలేదని, తమకు ప్రాణహాని ఉందని SPని ఆశ్రయించారు.

News December 9, 2025

ICSILలో ఉద్యోగాలకు అప్లై చేశారా?

image

ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్(ICSIL)లో 6 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి డిసెంబర్ 9 ఆఖరు తేదీ. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 10న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.590. నెలకు జీతం రూ.24,356 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://icsil.in