News October 6, 2025

విజయనగరంలో మద్యం దుకాణాలు బంద్

image

శ్రీ పైడితల్లమ్మ సిరిమానోత్సవం సందర్భంగా విజయనగరంలో మద్యం దుకాణాలు మూతబడ్డాయి. పట్టణంలో ఉన్న మొత్తం 14 మద్యం దుకాణాలతో పాటు 12 బార్లను నిన్న రాత్రి నుంచి అధికారులు మూసివేశారు. అలాగే జొన్నవలస, సుంకరిపేట, బియ్యాలపేటలో ఉన్న షాపులు కూడా మూతపడ్డాయి. సిరిమానోత్సవం పూర్తయిన తరువాత మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి షాపులు పునఃప్రారంభం కానున్నాయని సీఐ మన్మథరావు తెలిపారు.

Similar News

News January 23, 2026

WPL: యూపీపై గుజరాత్ విజయం

image

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్‌పై గుజరాత్ 45 రన్స్ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 153/8 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యూపీ 108 రన్స్‌కే కుప్పకూలింది. GG బౌలర్లలో రాజేశ్వరి 3, రేణుక, సోఫీ చెరో 2, కేశ్వీ, గార్డ్‌నర్ తలో వికెట్ తీశారు. ఈ ఓటమితో యూపీ ప్లేఆఫ్స్ ఆశలు సంక్లిష్టం అయ్యాయి.

News January 23, 2026

ముగిసిన దావోస్ పర్యటన.. రేపు HYDకు చంద్రబాబు

image

AP CM చంద్రబాబు దావోస్ పర్యటన ముగించుకుని స్వదేశానికి బయల్దేరారు. నాలుగు రోజుల పర్యటనలో పెట్టుబడులే లక్ష్యంగా ఆయన పలు కంపెనీల అధిపతులతో భేటీ అయ్యారు. మొత్తం 36కు పైగా సమావేశాల్లో పాల్గొన్నారు. రేపు ఉదయానికల్లా ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి అమరావతి వెళ్తారు.

News January 23, 2026

NGKL: మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటర్ల జాబితా సిద్ధం చేశామని వివరించారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.