News October 5, 2025

విజయనగరంలో విస్తృత తనిఖీలు

image

పైడితల్లమ్మ తొలేళ్ళు, సిరిమానోత్సవం సందర్భంగా పట్టణంలో పలు ప్రాంతాల్లోబాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నట్లుగా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. ఇందుకుగాను ఆదివారం ప్రత్యేకంగా నాలుగు బృందాలను ఏర్పాటు చేసామన్నారు. ఈ బృందాలు రైల్వే స్టేషను, ఆర్టీసి కాంప్లెక్సు, శ్రీ పైడితల్లమ్మ ప్రధాన ఆలయం, వనంగుడి దగ్గర ప్రత్యేక భద్రత దళాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయని వెల్లడించారు.

Similar News

News January 23, 2026

VZM: 27న జాబ్ మేళా.. నెలకు రూ.30,000 వరకు జీతం

image

విజయనగరంలోని మహారాజా కళాశాల ఆవరణలో ఈనెల 27న ఉదయం 10 గంటల నుంచి భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. నాలుగు సంస్థల ద్వారా 595 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. 10వ తరగతి నుంచి బీటెక్ వరకు అర్హత ఉన్న యువతీ, యువకులు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.14,765 నుంచి రూ.30,000 వరకు వేతనం ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు employment.ap.gov.in, ncs.gov.inలో నమోదు చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి వహీదా తెలిపారు.

News January 23, 2026

ఉపాధి హామీ కింద 100 రోజుల పని తప్పనిసరి: VZM కలెక్టర్

image

ఉపాధి హామీ పథకం కింద ప్రతి వేతనదారునికి 100 రోజుల పని తప్పనిసరిగా కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉపాధి పనులు, కుటుంబ సర్వే, అక్షరాంధ్ర కార్యక్రమాలపై మండల వారీగా సమీక్షించారు. నిర్దేశించిన లక్ష్యాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గృహ సర్వే ఫిబ్రవరి 10లోపు శతశాతం పూర్తి చేయాలని పేర్కొన్నారు.

News January 23, 2026

రూ.1300 కోట్లతో 4 ప్రాజెక్టుల పూర్తి: మంత్రి కొండపల్లి

image

పూర్వోదయ పథకం ద్వారా జిల్లాలో నాలుగు కీలక ఇరిగేషన్ ప్రాజెక్టులను రూ.1300 కోట్లతో పూర్తి చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. తోటపల్లి ద్వారా ప్రస్తుతం 58వేల ఎకరాలకు సాగునీరు అందుతుండగా, మిగిలిన భూములకు కూడా నీరు అందేలా పనులు పూర్తి చేస్తామన్నారు. ఉత్తరాంధ్రలోని ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం రూ.2వేల కోట్లు కేటాయించిదన్నారు.