News April 27, 2024

విజయనగరంలో 116, మన్యంలో 20 రిజెక్ట్

image

ఉమ్మడి జిల్లాలో నామినేషన్ వివరాలను సంబంధిత అధికారులు వెల్లడించారు. చీపురుపల్లిలో 12 మందికి 10, బొబ్బిలిలో 13కి 8, గజపతినగరంలో 15కి 9, నెల్లిమర్లలో 16కి 13, ఎస్.కోటలో 16కి 14, విజయనగరంలో 20కి 16 మంది అభ్యర్థుల నామినేషన్‌లను ఆమోదించారు. విజయనగరం MPకి 15 మంది నామినేషన్‌లు ఆమోదించారు. మన్యం జిల్లాలో పార్వతీపురంలో 18 సెట్లకి 14, సాలూరులో 15కి 13, కురుపాంలో 19కి 16, అరకు MPకి 38లో 27సెట్లు ఆమోదించారు.

Similar News

News April 12, 2026

VZM: కలెక్టరేట్‌లో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటలకు విజయనగరంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. భూ సమస్యల కోసం ప్రత్యేకంగా ‘రెవెన్యూ క్లినిక్’ కూడా నిర్వహిస్తామన్నారు. కలెక్టరేట్‌కి రాలేని వారు 1100 టోల్ ఫ్రీ నంబర్/ meekosam.ap.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ సూచించారు.

News April 12, 2026

విజయనగరం వైద్య కళాశాలలో కొత్త అధ్యాయం!

image

విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల మొదటి బ్యాచ్ పీజీ విద్యార్థుల ఓరియెంటేషన్ శనివారం ముగిసింది. జనరల్ మెడిసిన్, సర్జరీ, ప్రసూతి, పిల్లల వైద్యం వంటి విభాగాల్లో 20 మంది విద్యార్థులు చేరారు. ముగింపు వేడుకలో డా. పి.వి. సుధాకర్ హాజరై “కలలను నిజం చేసుకునే దిశగా” అనే అంశంపై ప్రసంగించారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. కొత్త విద్యార్థుల రాకతో కళాశాలలో కోలాహలం నెలకొంది.

News April 12, 2026

విజయనగరం: ట్రాక్టర్‌పై నుంచి జారిపడి యువకుడు మృతి

image

ట్రాక్టర్ పైనుంచి జారిపడి ఆడారి వంశీ(28) మృతి చెందినట్లు పట్టణ సీఐ కె.నారాయణరావు చెప్పారు. పార్వతీపురం మండలం కారాడవలస నుంచి బొబ్బిలి మండలం డొంగురువలస పెళ్లికి శుక్రవారం రాత్రి వచ్చి ట్రాక్టర్ పై తిరిగి వెళ్తుండగా మితిమీరిన వేగంతో ట్రాక్టర్ నడపడం వల్ల తొట్టెలో ఉన్న వంశీ జారిపడి తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు శనివారం చెప్పారు. అతని తండ్రి తవిటన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.