News August 14, 2025

విజయనగరం జిల్లాలో నేడు హోం మినిస్టర్ పర్యటన

image

విజయనగరం జిల్లాకు హోం మంత్రి వంగలపూడి అనిత గురువారం రానున్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న జిల్లా సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొంటారు. ఆమెతో పాటు జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యే లు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు. జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నట్లు కలెక్టర్ అంబేడ్క‌ర్ తెలిపారు.

Similar News

News March 9, 2026

VZM: కలెక్టరేట్‌లో నేడు PGRS కార్యక్రమం

image

విజయనగరం జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం విజయనగరం కలెక్టరేట్‌లో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం 1 వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలను స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

News March 8, 2026

VZM: అండర్-13, 18 క్రీడాకారుణులకు పరుగు పందెం పోటీలు

image

మహిళా దినోత్సవం సందర్భంగా మై భారత్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు ఆదివారం బాబామెట్టలోని విజ్జీ స్టేడియంలో జరిగాయి. అండర్-13, 18 18 ఏళ్లు పైబడిన విభాగాల్లో 100, 200, 400 మీటర్ల పరుగు పందెం పోటీలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల నుంచి విద్యార్థినులు పాల్గొన్నారు. విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లను అందజేశారు.