News August 13, 2025

విజయనగరం జిల్లాలో 49,127 గృహ నిర్మాణాలు పూర్తి: కలెక్టర్

image

ఈ నెలాఖరులోగా జిల్లాలో 2 వేల గృహాలను పూర్తి చెయ్యాలని కలెక్టర్ అంబేడ్క‌ర్ అధికారులకు ఆదేశించారు. బుధవారం అధికారులతో వెబెక్స్ ద్వారా గృహ నిర్మాణాల పై సమీక్షించారు. ప్రస్తుతం రూఫ్ లెవెల్‌లో ఉన్న 2 వేల గృహాలను నెలాఖరుకు పూర్తయ్యేలా చూడాలని MPDOలకు లక్ష్యంగా నిర్ణయించారు. జిల్లాలో పి.ఎం.ఏ.వై అర్బన్, గ్రామీణ్ క్రింద 72,496 గృహాలు మంజూరు కాగా 49,127 గృహాలు పూర్తయ్యాయన్నారు.

Similar News

News March 12, 2026

VZM: డొమెస్టిక్ సిలిండర్లు వాడితే ‘6A’ కేసులు

image

విజయనగరం జిల్లాలోని హోటళ్లు, దాబాలు, వాణిజ్య కేంద్రాల్లో గృహ అవసరాల గ్యాస్ సిలిండర్లను వాడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా పౌరసరఫరాల అధికారి మురళీనాథ్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే 6A కేసులు నమోదు చేస్తామన్నారు. ఆరు నెలల్లో 10 కేసులు నమోదు చేసి, 40 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు మీడియాకు ఇవాళ తెలిపారు. అక్రమ రీఫిల్లింగ్, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.

News March 11, 2026

VZM: మహిళతో పెళ్లికి నిరాకరణ..ఏడాది జైలు శిక్ష

image

మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన కేసులో నిందితుడు బండి సుచిత్‌కు మహిళా కోర్టు బుధవారం ఏడాది శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధించింది. బూర్లిపేటకు చెందిన మహిళతో పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాక మొహం చాటేశాడనే మహిళ ఫిర్యాదుతో కేసును కోర్టుకు అప్పగించగా..శిక్ష ఖరారైందని విజయనగరం మహిళా పీఎస్ డీఎస్పీ ఆర్. గోవిందరావు మీడియాకు తెలిపారు.

News March 11, 2026

VZM: ఇన్‌స్టాగ్రామ్‌ లవ్..చివరికి జైలు పాలు

image

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకుని ప్రేమ, పెళ్లి పేరుతో 16 ఏళ్ల బాలికను మోసం చేసిన కేసులో కొండవెలగాడ గ్రామానికి చెందిన నిందితుడు పంది నారాయణ (24)కు పోక్సో ప్రత్యేక కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.6 వేల జరిమానాను బుధవారం విధించింది. బాధితురాలికి రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. నెల్లిమర్ల PS‌లో నమోదైన ఈ కేసులో నేరం నిరూపితమవడంతో కోర్టు తీర్పు ఇచ్చిందని ఎస్పీ దామోదర్ తెలిపారు.