News August 10, 2024

విజయనగరం: భార్యాభర్తలపై దాడి.. కేసు నమోదు

image

విజయనగరం జిల్లాలో అర్ధరాత్రి ఆకతాయిల వేధింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల నెల్లిమర్ల, గరివిడిలో ఘటనలు మరవక ముందే తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 8న అర్ధరాత్రి భార్యాభర్తలు పెందుర్తి వెళ్లేందుకు ట్రైన్ కోసం రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. టీ తాగేందుకు బయటకు రాగా.. గుర్తు తెలియని వ్యక్తులు మహిళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ భర్తపై దాడి చేశారు. 1వ పట్టణ పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు.

Similar News

News September 8, 2024

VZM: ‘భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి’

image

భారీ వర్షాల పట్ల ఉమ్మడి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సూచించారు. ఆదివారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు జిల్లాలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. వంతెనలు, కాజ్ వే ల పై ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News September 8, 2024

పార్వతీపురం మన్యం జిల్లాలో రేపు సెలవు

image

వర్షాల కారణంగా పార్వతీపురం మన్యం జిల్లాలో పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వాతావరణ కేంద్ర హెచ్చరికల మేరకు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అన్నారు. ఈ అంశాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారులు గమనించి తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

News September 8, 2024

విజయనగరం జిల్లాలో రేపు సెలవు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. సోమవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ అంబేడ్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే సోమవారం కలెక్టరేట్‌లో జరగవలిసిన ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.