News June 11, 2024

విజయనగరం: మా ఉద్యోగాలకు భద్రత కల్పించాలి: వైన్స్‌షాపు ఉద్యోగులు

image

విజయనగరం జిల్లాలో 3,600 మద్యం షాపులు, 40 వేల కుటుంబాలు మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. దత్తిరాజేరు మండలం మానాపురం, మరడాం, రాజుల రామచంద్రపురం, మేడపల్లి, చల్లపేట వైన్‌షాపుల్లో చేస్తున్న సిబ్బంది రోడ్డెక్కారు. కొత్త ప్రభుత్వంలో కొత్త మద్యం పాలసీ తీసుకొస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని వారు ఆందోళన చెందారు. ఈ సమస్యని సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని మీడియాని కోరారు.

Similar News

News March 20, 2025

VZM: నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి: SP

image

సైబరు నేరాలను చేధించేందుకు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని ఎస్పీ వకుల్ జిందల్ సూచించారు. స్థానిక పోలీస్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్లగా పని చేస్తున్న కానిస్టేబుళ్లకు బుధవారం అవగాహన కల్పించారు. రాబోయే రోజుల్లో సైబరు నేరాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. నేరాలను నియంత్రించుట, నమోదైన కేసుల్లో దర్యాప్తు చేపట్టుటకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతీ పోలీసు అధికారి మెరుగుపర్చుకోవాలన్నారు.

News March 19, 2025

VZM: ZP ఛైర్మన్‌కు మాజీ CM జగన్ పరామర్శ

image

విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాస్ రెండో కుమారుడు ప్రణీత్ బాబు బుధవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోన్‌లో చిన్న శ్రీనును పరామర్శించారు. మృతికి గల కారణాన్ని అడిగి తెలుసుకున్నారు. చిన్న శ్రీను కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లోనే మనోధైర్యంగా ఉండాలంటూ జగన్ ధైర్యం చెప్పారు.

News March 19, 2025

VZM: “టెన్త్ పరీక్షకు 94 మంది గైర్హాజరు”

image

బుధవారం జిల్లా వ్యాప్తంగా జరిగిన 10వ తరగతి హిందీ పరీక్షకు 94 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఈవో యు.మాణిక్యం నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 119 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకి మొత్తం 22,834 విద్యార్థులకు గాను 22740 మంది విద్యార్థులు హాజరయ్యారని అన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు సజావుగా జరిగిందని తెలియజేశారు.

error: Content is protected !!