News April 26, 2024

విజయనగరం: ‘మీ ఓటు.. మీ భ‌విష్య‌త్తు’

image

మీరు వేసే ప్ర‌తీ ఓటు మీ భ‌విష్య‌త్తును నిర్ణ‌యిస్తుంద‌ని అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ స‌హాదిత్ వెంక‌ట త్రివినాగ్ అన్నారు. స్వీప్ కార్య‌క్ర‌మంలో భాగంగా గురువారం ప‌ట్ట‌ణంలోని కోట‌, బాలాజీ, మ‌యూరి జంక్షన్ల వ‌ద్ద కేంద్రీయ గిరిజ‌న విశ్వ‌విద్యాల‌య విద్యార్దులు ఫ్లాష్ మాబ్ నిర్వ‌హించారు. ఓటు హ‌క్కు వినియోగం ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించారు. హుషారైన‌ నృత్యాల‌ను ప్ర‌ద‌ర్శించి ఉర్రూత‌లూగించారు.

Similar News

News April 11, 2026

VZM: ‘ఫులే సేవలు ప్రజలందరికీ తెలియజేయాలి’

image

జ్యోతిరావు ఫులే సమాజానికి చేసిన సేవలను ప్రజలందరికీ తెలియజేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఫులే జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. CM చంద్రబాబు ఫులే జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహిస్తున్నారని మంత్రి అన్నారు. బహుజనులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఫులే అహర్నిశలు కృషి చేశారని కలెక్టర్ పేర్కొన్నారు.

News April 11, 2026

కేజీబీవీలో ప్రవేశాలకు గడువు పొడిగింపు: డీఈవో

image

జిల్లాలోని కేజీబీవీలో 2026-27 ఏడాదికి 6,7,8,9,10, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాల దరఖాస్తులను ఈనెల 20 వరకు పొడిగించినట్లు డీఈవో మాణిక్యం నాయుడు తెలిపారు. రేపటితో ప్రవేశాల దరఖాస్తుల ప్రక్రియ ముగిసినప్పటికీ, విద్యార్థుల తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు మరోసారి గడువు పొడిగించినట్లు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ బాలికలు దరఖాస్తు చేసుకోవాలని శుక్రవారం పేర్కొన్నారు.

News April 11, 2026

ప్రజారోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదు: జేసీ

image

ఆహార భద్రతా ప్రమాణాలు పాటించని వాటర్ ప్లాంట్లు, నెయ్యి విక్రయదారులు, స్వీట్, కిరాణా షాపులపై జేసీ సేతుమాధవన్ చర్యలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ అధికారి నాగుల్ మీరా నిర్వహించిన తనిఖీల్లో నాణ్యత లోపాలు బయటపడటంతో పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను విచారించిన జేసీ, నిందితుల సమక్షంలో రూ.1,04,000 జరిమానా విధించారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదని హెచ్చరించారు.