News October 7, 2025
విజయవాడలో చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి

చెట్టుపై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన విజయవాడలో మంగళవారం జరిగింది. గాయత్రీ నగర్లోని నలంద స్కూల్లో చెట్లు నరికేందుకు పమిడిముక్కల నుంచి రమణ అనే వ్యక్తిని పని నిమిత్తం తీసుకొచ్చారు. చెట్టు నరుకుతూ ఉండగా రమణ ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. స్కూల్ యాజమాన్యం ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లగా మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News January 21, 2026
ఖమ్మం: గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం జిల్లాలోని మైనార్టీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థులు వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్‌లో అడ్మిషన్లకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. వసతి సౌకర్యంతో కూడిన ఉచిత నాణ్యమైన విద్యను మైనారిటీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News January 21, 2026
ఎన్నికల కోసం ఇన్‌ఛార్జ్‌లను నియమించిన BJP

పలు రాష్ట్రాల్లో జరగనున్న ఎలక్షన్స్‌కు BJP జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఎన్నికల ఇన్‌ఛార్జులను నియమించారు. TG మున్సిపల్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా MH మంత్రి ఆశిష్ షేలార్‌కు బాధ్యతలు అప్పగించారు. కో-ఇన్‌ఛార్జులుగా అశోక్ పర్నామీ(RJ BJP మాజీ అధ్యక్షుడు), MP రేఖా శర్మలను నియమిస్తున్నట్లు ప్రకటించారు. KL అసెంబ్లీ, చండీగఢ్ మేయర్, బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికలకూ ఇన్‌ఛార్జ్, కో-ఇన్‌ఛార్జులను నియమించారు.
News January 21, 2026
నేడు లలితా వ్రతం ఆచరిస్తే సకల సంపదలు

నేడు మాఘ శుద్ధ తదియ. ఈరోజు ‘లలితా వ్రతం’ ఆచరించడం అత్యంత శుభప్రదమని నమ్ముతారు. లలితా దేవిని షోడశోపచారాలతో పూజించి, ఎర్రటి పుష్పాలు, కుంకుమతో అర్చన చేస్తారు. వివాహిత స్త్రీలు సౌభాగ్యం కోసం, కన్యలు ఉత్తమమైన వరుడు లభించాలని ఈ వ్రతాన్ని ఎంతో నిష్ఠతో చేస్తారు. శక్తి స్వరూపిణి అయిన లలితా పరాభట్టారికను ధ్యానిస్తూ లలితా సహస్రనామ పారాయణ చేస్తే పాపాలన్నీ తొలగి, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.


