News October 8, 2025

విజయవాడలో జోరుగా చీకటి వ్యాపారం

image

విజయవాడలోని ప్రకాశం రోడ్, అప్సర థియేటర్ ప్రాంతాలు వ్యభిచారానికి అడ్డాగా మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఉదయం 10 నుంచి రాత్రి ఒంటిగంట వరకు వ్యభిచారం చేసే మహిళలు రోడ్డుపై ఉంటూ ప్రజలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. వీరు విటులను సమీపంలోని లాడ్జిలకు తీసుకువెళుతున్నారు. పలువురు విటులను బెదిరించి నగదు దోచుకుంటున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. పోలీసులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

Similar News

News January 15, 2026

యాదాద్రి భువనగిరి మున్సిపల్ రిజర్వేషన్లు ఇవే..

image

1.భువనగిరి 35: ST 1,SC 5, BC 11, UR 18.
2.ఆలేరు 12: ST 1,SC 2, BC 3, UR 6.
3.చౌటుప్పల్ 20: ST 1,SC 3, BC 6, UR 10.
మోత్కూర్ 12: ST 1,SC 2, BC 3, UR 6.
పోచంపల్లి 13: ST 1,SC 1, BC 4, UR 7.
యాదగిరిగుట్ట 12: ST 1,SC 1, BC 4, UR 6.

News January 15, 2026

20 నుంచి కేయూ దూరవిద్య ఎమ్మెస్సీ పరీక్షలు

image

కేయూ పరిధిలోని దూరవిద్య కేంద్రం(సీడీఓఈ) ఎమ్మెస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ప్రీవియస్, ఫైనలియర్ విద్యార్థులకు ఈ నెల 20 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు నియంత్రణాధికారి డాక్టర్ పద్మజ తెలిపారు. ప్రీవియస్ పరీక్షలు ఈ నెల 20, 22, 24, 27 తేదీల్లో జరుగుతాయి. ఫైనలియర్ పరీక్షలు 20, 22, 24, 27, 31 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు.

News January 15, 2026

బంగ్లా క్రికెట్‌లో తిరుగుబాటు: బోర్డు డైరెక్టర్ రాజీనామాకు డిమాండ్!

image

BCB డైరెక్టర్ నజ్ముల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆ దేశ క్రికెట్‌లో చిచ్చు రేపాయి. T20 వరల్డ్ కప్ నుంచి తప్పుకొంటే ఆటగాళ్లకు నష్టపరిహారం చెల్లించబోమని అనడంపై క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నజ్ముల్ వెంటనే రాజీనామా చేయాలని, లేనిపక్షంలో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ను బహిష్కరిస్తామని హెచ్చరించారు. వివాదం ముదరడంతో స్పందించిన బోర్డు, ఆ వ్యాఖ్యలు తమ అధికారిక వైఖరి కాదంటూ విచారం వ్యక్తం చేసింది.