News May 1, 2024

విజయవాడలో డాక్టర్ కుటుంబం ఆత్మహత్య వివరాలివే..

image

ఆర్థిక సమస్యలు కుటుంబాన్ని బలి తీసుకున్న ఘటన మంగళవారం విజయవాడ నగరం పటమటలో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే మొత్తం ఐదుగురు చనిపోగా.. ధరావత్ శ్రీనివాస్ 40 (డాక్టర్) భార్య ఉష (38) కుమార్తె శైలజ (9) కుమారుడు శ్రీహన్ (5) తల్లి రమణమ్మ (65) ఉన్నారు. తండ్రి జలమయ్య నాయక్ పోలీసు శాఖలో పనిచేసి పదేళ్లక్రితం మరణించారు.

Similar News

News December 8, 2025

మచిలీపట్నం: అనాథ పిల్లలకు అమృత ఆరోగ్య కార్డులు

image

మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం ఎన్టీఆర్ వైద్య సేవల అమృత ఆరోగ్య పథకం కింద 17 అనాథ ఆశ్రమాలకు చెందిన 82 మంది అనాథ పిల్లలకు ఆరోగ్య కార్డులు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్, పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. వారి ఆరోగ్య భద్రతపై అవగాహన కూడా కల్పించారు.

News December 8, 2025

కృష్ణా జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు: కలెక్టర్

image

జిల్లాలో ఈ నెల 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న ఏపీ టెట్ పరీక్షల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సోమవారం ఆయన సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలు చేయాలన్నారు.

News December 8, 2025

మచిలీపట్నం: అనాధ పిల్లలకు ఆరోగ్య కార్డుల పంపిణీ

image

అనాధ పిల్లలకు ఆరోగ్య పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్‌లో ఎన్టీఆర్ వైద్య సేవల అమృత ఆరోగ్య పథకం కింద 17 అనాధ ఆశ్రమాలకు చెందిన 82 మంది అనాధ పిల్లలకు కలెక్టర్ చేతుల మీదుగా ఆరోగ్య కార్డులు అందజేశారు. ఆరోగ్యశ్రీ కార్డుల మాదిరి ఈ కార్డులు కూడా పని చేస్తాయన్నారు. కార్యక్రమంలో DMHO యుగంధర్, తదితరులు పాల్గొన్నారు.