News November 19, 2025

విజయవాడలో నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్: మంత్రి

image

విజయవాడలో ఐఐటీ, నీట్ ఎక్సలెన్సీ సెంటర్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి
మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. ఎస్సీ,ఎస్టీ విద్యార్థుల సంక్షేమం పట్ల సీఎం ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు. కబేలా సెంటర్లో రూ.80 లక్షలతో శాశ్వత ఐఐటీ నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్ నిర్మిస్తామని చెప్పారు.

Similar News

News January 19, 2026

MGUలో 52 కొత్త పోస్టులకు కేబినెట్ ఆమోదం

image

నల్గొండ మహాత్మాగాంధీ వర్సిటీకి కేబినెట్ తీపి కబురు చెప్పింది. లా కాలేజీలో 24, ఫార్మసీ కాలేజీలో 28 చొప్పున మొత్తం 52 కొత్త పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపింది. అలాగే వీరనారి చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలో రిజిస్ట్రార్ పోస్టు భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మేడారంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యా ప్రమాణాలు పెంచేందుకే ఈ పోస్టులు మంజూరు చేసినట్లు మంత్రులు తెలిపారు.

News January 19, 2026

మీ పరిధిలో సమస్యలా..మీకోసం వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయండి: కలెక్టర్

image

పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం PGRS కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ ప్రభాకర్‌ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సంబంధిత అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌లో నిత్యం వినతులు స్వీకరిస్తామన్నారు. అర్జీదారులు మీకోసం వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాలకు 1100కు ఫోన్ చేసి తెలుసుకోవాలన్నారు.

News January 19, 2026

మళ్లీ ‘జనరల్ మహిళ’కే ఖమ్మం మేయర్ పీఠం

image

ఖమ్మం నగరపాలక సంస్థ మేయర్ పీఠం వరుసగా రెండోసారి ‘జనరల్ మహిళ’కు రిజర్వ్ అయింది. కార్పొరేషన్ ఏర్పడిన తొలిసారి ఎస్టీ జనరల్‌కు కేటాయించగా పాపాలాల్ మేయర్‌గా పనిచేశారు. రెండో విడతలో జనరల్ మహిళకు కేటాయించడంతో నీరజ మేయర్‌గా ఎన్నికయ్యారు. తాజాగా మరోసారి జనరల్ మహిళకే అవకాశం దక్కనుంది. ఈ రిజర్వేషన్‌తో ప్రధాన పార్టీల నుంచి మహిళా అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది.