News November 20, 2025

విజయవాడలో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ

image

UPSC సివిల్స్ పరీక్షకు సిద్ధమయ్యే బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ క్లాసులలో జాయినయ్యే ఆసక్తి ఉన్న అభ్యర్థులు విజయవాడ అశోక్‌నగర్, పండరీపురం రోడ్ నం 8లో ఉన్న స్టడీ సర్కిల్ కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత అధికారులు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రవేశ పరీక్ష నిర్వహించి ఉచిత శిక్షణకు అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు.

Similar News

News January 19, 2026

రెవెన్యూ లోటుతో ఉక్కిరిబిక్కిరి

image

మూడేళ్లుగా APని రెవెన్యూ లోటు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కమిటెడ్ వ్యయం పెరగడం, పన్నేతర ఆదాయం తగ్గడం దీనికి కారణమని కాగ్ నివేదిక పేర్కొంటోంది. FY25-26 NOV నాటికి ₹54355 CR రెవెన్యూ లోటు ఉంది. ఈ లోటు 2024లో ₹56805 CR, 2023లో ₹47063 CRగా ఉంది. దీని భర్తీకి అప్పులు చేయక తప్పడం లేదు. రుణాల్లో 80% శాలరీ, పెన్షన్లు వంటి రెవెన్యూ ఖర్చుకే సరిపోతుండగా క్యాపిటల్ వ్యయం అంతంతే.

News January 19, 2026

JGTL: ‘ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరతకు చెక్’

image

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔషధాల కొరతకు చెక్ పెట్టే దిశగా JGTLలో రూ.3 కోట్లతో సెంట్రల్ మెడిసిన్ స్టోర్‌ను రేపు ప్రారంభించనున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన మందులు ఒకే కేంద్రం నుంచి సరఫరా చేసే విధానం అమల్లోకి రానుందన్నారు. పేద రోగులకు ఉచితంగా నాణ్యమైన ఔషధాలు సమయానికి అందించడమే లక్ష్యమన్నారు. ఔషధాల నిల్వ, పంపిణీలో పారదర్శకత వైద్య సేవలు మరింత బలోపేతం అవుతాయన్నారు.

News January 19, 2026

రాజకీయ వేధింపులే కాంగ్రెస్ అజెండా: KTR

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు <<18900983>>నోటీసులు<<>> జారీ చేయడంపై KTR తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని ‘X’ వేదికగా మండిపడ్డారు. ఇందులో పస లేదని సుప్రీంకోర్టే కేసును కొట్టివేసిందని గుర్తు చేశారు. అయినా నోటీసులు ఇవ్వడం ప్రభుత్వ దిగజారుడుకు నిదర్శనమన్నారు. రేవంత్ బావమరిది సుజన్ రెడ్డి బొగ్గు గనుల కుంభకోణాన్ని బయటపెట్టినందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు.