News April 22, 2025
విజయవాడలో పోలీసుల ఫోకస్

విజయవాడలో రాత్రి గస్తీని పోలీసులు కట్టుదిట్టం చేశారు. నెంబర్ లేని వాహనాలు, అనుమానితులు, అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఆదేశాల మేరకు లాడ్జిలు, హోటళ్లు, నిర్జన ప్రదేశాల్లో తనిఖీలు చేస్తున్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గస్తీలో భాగంగా ముఖ్య కూడళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Similar News
News March 17, 2026
ఏపీని డ్రగ్స్ అడ్డాగా మార్చారు: వైసీపీ

కూటమి ప్రభుత్వం ఏపీని డ్రగ్స్ అడ్డాగా మార్చిందని వైసీపీ విమర్శించింది. నాడు వంద రోజుల్లో గంజాయిని అరికడతామని చెప్పి.. నేడు రాష్ట్రం మొత్తం గంజాయి అమ్మకాలు జోరుగా సాగిస్తోందని ధ్వజమెత్తింది. ప్రస్తుతం టీడీపీ నాయకులు, వారి కొడుకులు డ్రగ్స్ వ్యాపారంలో మునిగితేలుతున్నారని, ఏకంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ డ్రగ్స్‌తో దొరికిపోవడంతో టీడీపీ నాయకులు సిగ్గుతో కుమిలిపోతున్నారని పేర్కొంది.
News March 17, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారం వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,600
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,352
* వెండి 10 గ్రాముల ధర రూ.2,610.
News March 17, 2026
బాపట్ల రైతులకు JC సూచనలు

రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో విక్రయించుకోవాలని బాపట్ల జాయింట్ కలెక్టర్ భావన మంగళవారం పేర్కొన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 1,73,384.540 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈనెల 28తో మూసివేస్తారన్నారు. రైతులు తమ ధాన్యాన్ని 28 లోపు విక్రయించుకోవాలన్నారు.


