News October 6, 2025
విజయవాడలో మహిళ హత్యకు కారణం ఇదే..!

విజయవాడ భవానిపురంలో సంచలనం సృష్టించిన విజయలక్ష్మి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కక్ష్యతో లక్ష్మీనరసింహా, అతని కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భార్య పుట్టింటికి వెళ్లడానికి విజయలక్ష్మి కారణమని కక్ష పెంచుకున్న లక్ష్మీనరసింహ ఆమెను ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి హత్య చేసినట్లు నిర్ధారించారు.
Similar News
News January 24, 2026
డెయిరీ ఫామ్ ప్రారంభించే ముందు ఇవి చేయాలి

డెయిరీ ఫామ్ ప్రారంభానికి ముందు కొంత భూమిలో నేపియర్, గినీ గడ్డి, జొన్న.. మరి కొంత భూమిలో అలసంద, పిల్లిపెసర, లూసర్న్ పశుగ్రాసాలను సాగుచేయాలి. సుబాబుల్, అవిసె చెట్లను ఫామ్ పెట్టే స్థలం చుట్టూ కంచెలా వేయాలి. ఇలా పశుగ్రాసాన్ని పెంచి, షెడ్లు కట్టిన తర్వాత పరికరాలు, మందులు కొనుగోలు చేశాక పాడి పశువులను కొనాలంటున్నారు నిపుణులు. అధిక పాలిచ్చే పశువుకు ఉండే లక్షణాలు తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్ <<>>చేయండి.
News January 24, 2026
ఏలూరు: ప్రమాదం.. బావాబామ్మరుదులు మృతి

గ్రీన్ ఫీల్డ్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో జంగారెడ్డిగూడెం మండలం లక్కవరానికి చెందిన కొమ్ము సాయి, కామవరపుకోట మండలం రామవరానికి చెందిన గట్టు రాంబాబు మృతి చెందారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాల గ్రామ సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవే పై బైక్ అదుపు తప్పి రైలింగ్ ఢీకొనడంతో వారిద్దరూ మృతి చెందారు. వారిద్దరూ వరుసకు బావ బావమరుదులు. మొక్కజొన్న కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలిసింది.
News January 24, 2026
14.6 డిగ్రీలకు పడిపోయిన పటాన్‌చెరు ఉష్ణోగ్రత

సంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. శనివారం ఉదయం జిన్నారంలో 16.0°, గుమ్మడిదలలో 17.9°, అమీన్పూర్‌లో 18.8°, రామచంద్రాపురంలో 18.7°, పటాన్‌చెరులో 14.6° ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమశాతం 88.4%గా ఉంది. ఉదయం పొగమంచు కమ్ముకోవడంతో విజిబిలిటీ తగ్గి వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


