News October 14, 2024

విజయవాడలో 16న వాలీబాల్ జట్ల ఎంపికలు

image

స్థానిక ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో అక్టోబర్ 16న వాలీబాల్ జట్ల ఎంపికలను నిర్వహిస్తున్నట్లు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ఎస్జీఎఫ్ కార్యదర్శులు శ్రీను, ఎస్.శ్రీనివాస్‌లు తెలిపారు. ఈ ఎంపికలు పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్-14, 17 బాలురకు మాత్రమే జరుగుతాయన్నారు. జిల్లాలో ఆసక్తి గల బాలురు ఉదయం 9 గంటలకు జిల్లా ఎస్జీఎఫ్ ఎంట్రీ ఫామ్‌తో హాజరుకావాలన్నారు.

Similar News

News November 11, 2024

మచిలీపట్నం: ఈ ఆలయంలో అన్ని మతాల దేవుళ్ల దర్శనం

image

మచిలీపట్నంలోని సాయిబాబా ఆలయంలో ఒకేసారి అందరి దేవుళ్లను దర్శించుకోవచ్చు. ఈ బాబా విగ్రహం ఎత్తు 44, వెడల్పు 45 అడుగులు ఉంటుంది. 2011 ఆగస్టులో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ప్రపంచంలోనే ఎత్తైన సాయిబాబా విగ్రహంగా ప్రకటించారు. ఈ ఆలయంలో పలు రూపాలలో బాబా దర్శనం ఇస్తాడు. ఇక్కడ హిందూ, ముస్లీం, క్రైస్తవ మతాలకు చెందిన దేవుళ్లు ఉండటం విశేషం. ఈ బాబా కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తులు చెబుతున్నారు.

News November 11, 2024

కృష్ణా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గొంతు వినిపిస్తారా?

image

నేటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు ఉమ్మడి కృష్ణా ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఎన్నికలు జరిగాక తొలి బడ్జెట్ సమావేశం కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎన్నికలకు ముందు రోడ్ల సమస్యలు, తోటపల్లి ఎత్తిపోతల పథకం కాలువ పనులు, యువతకు ఉద్యోగ కల్పన తదితర అంశాలపై ప్రస్తుతం ఎన్నికైన ఎమ్మెల్యేలు హామీలు ఇచ్చారు. మరి వీటి అమలుకు నిధులు వచ్చేలా అసెంబ్లీలో చర్చిస్తారా? లేదా? మీ కామెంట్.

News November 11, 2024

‘ఇక్కడ ప్రార్థన చేస్తే కోరికలు నెరవేరుతాయి’

image

విజయవాడ గుణదల మేరీమాత చర్చి ప్రాచుర్యమైంది. ఈ పవిత్ర స్థలాన్ని మేరీమాత మందిరం అని పిలుస్తారు. ఇక్కడి కొండపై ఏర్పాటు చేసిన శిలువ అరుదైనదని భక్తులు చెబుతున్నారు. ఈ శిలువ వద్ద ప్రార్థనలు చేస్తే కోరికలు నెరవేరుతాయని క్రైస్తవుల నమ్మకం. ఇక్కడ నిత్యం చిన్నపిల్లలకు కుట్టు పోగులు, అన్నప్రాసన, తలనీలాలు సమర్పిస్తారు. వివాహాలు చేసుకుంటారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చిలో ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.