News April 3, 2024

విజయవాడ: అత్యంత కీలకం కానున్న 29వేల ఓట్లు

image

2019 ఎన్నికల్లో జనసేనతో పొత్తులో భాగంగా విజయవాడ సెంట్రల్‌లో పోటీ చేసిన సీపీఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు 29,333 ఓట్లు(16.48%) సాధించారు. 2019లో టీడీపీ అభ్యర్థి బొండా ఉమ 25 ఓట్ల తేడాతో విష్ణు చేతిలో ఓడిపోయారు. పొత్తులో భాగంగా NDA నుంచి మళ్లీ ఉమను బరిలో దింపారు. కాంగ్రెస్‌తో జతకట్టిన సీపీఎం బాబురావుకు మరలా టికెట్ ఇచ్చే ఛాన్సుంది. దీంతో ఈసారి కూడా బాబురావుకు వచ్చే ఓట్లు కీలకం కానున్నాయి.

Similar News

News February 16, 2026

కృష్ణా: రోడ్డు ప్రమాదాల నివారణపై కలెక్టర్ సమీక్ష

image

కలెక్టర్ డీకే బాలాజీ అధ్యక్షతన మచిలీపట్నం కలెక్టరేట్‌లో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకున్న చర్యలపై సమీక్షించారు. మచిలీపట్నం-విజయవాడ NHపై వేగ నియంత్రణల కోసం ఏర్పాటు చేసిన డ్రమ్ములు రాత్రి పూట కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. స్పందించిన కలెక్టర్ తక్షణమే డ్రమ్ములకు రేడియం స్టిక్కర్లు వేయాలని ఆదేశించారు.

News February 16, 2026

PGRSలో వచ్చే ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలి: DRO

image

PGRSలో వచ్చే ప్రతి అర్జీకి పరిష్కార మార్గం చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం మచిలీపట్టణం కలెక్టరేట్ మీటింగ్ హాలులో నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో ఆయన పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

News February 16, 2026

బిల్ గేట్స్‌కు కలంకారీ వస్త్రాలను బహుకరించిన కలెక్టర్

image

రాష్ట్ర పర్యటనకు వచ్చిన బిల్ గేట్స్‌కు గన్నవరం విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం లభించింది. కలెక్టర్ డీకే బాలాజీ బిల్ గేట్స్‌కు పెడన కలంకారీ వస్త్రాలను బహుకరించి స్వాగతం పలికారు. సహజమైన రంగులతో ముద్రించిన కలంకారీ వస్త్రాల విశిష్టత, దాని వెనుక దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని కలెక్టర్ ఆయనకు వివరించారు.