News February 9, 2025
విజయవాడ: గుణదల తిరునాళ్లకు వచ్చేవారికి గుడ్ న్యూస్

మేరీ మాత ఉత్సవాలకు వచ్చేవారికై రామవరప్పాడులో కింది రైళ్లకు ఆదివారం నుంచి మంగళవారం వరకు స్టాప్ ఇచ్చామని రైల్వే అధికారులు తెలిపారు. నం.67257 విజయవాడ-నరసాపురం, నం.67258 మచిలీపట్నం-విజయవాడ రైళ్లకు రామవరప్పాడులో స్టాప్ ఇచ్చామన్నారు. అదే విధంగా నేడు ఆదివారం నం.17482 తిరుపతి-బిలాస్‌పూర్, నం.17480 తిరుపతి-పూరి రైళ్లు రామవరప్పాడులో 10,11 తేదీలలో ఆగుతాయన్నారు.
Similar News
News February 19, 2026
తల్లి పాదాలు కడిగి నీళ్లు తాగిన సీనియర్ హీరో

బాలీవుడ్ సీనియర్ యాక్టర్ గోవిందా మంచితనం గురించి గతంలో చాలామంది చాలా ఉదహరించారు. తాజాగా ఆయన మేనల్లుడు వినయ్ ఆనంద్ సైతం.. 90s స్టార్ విలువలకు నిదర్శనమని ప్రశంసించారు. ‘మా అమ్మమ్మ నిర్మల ప్రతి బర్త్‌డేకి మామయ్య ఆమె కాళ్లు కడిగి నమస్కరించి ఆ నీళ్లు తాగేవాడు’ అని తెలిపారు. ఆయన రీల్ లైఫ్, రియల్ లైఫ్‌ను చాలామంది కాపీ కొట్టారని, అది గోవిందా గొప్పతనమని వెల్లడించారు.
News February 19, 2026
KMR: సహేరి అంటే ఏమిటి? ఇఫ్తార్ విశిష్టత ఇదే..

తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు, అంటే ఫజర్ అజాన్ కంటే ముందే తీసుకునే ఆహారాన్ని ‘సహేరి’ అంటారు. రోజంతా నిష్టగా ఉపవాసం ఉండేందుకు శరీరానికి అవసరమైన శక్తిని ఈ ఆహారం అందిస్తుంది. రోజంతా నీరు కూడా ముట్టకుండా కఠిన దీక్షను పాటించిన అనంతరం, సూర్యాస్తమయం వేళ దీక్షను విరమించడాన్ని ‘ఇఫ్తార్’ అంటారు. సాధారణంగా ఖర్జూరం లేదా మంచి నీటితో ఉపవాసాన్ని విరమిస్తారు.
News February 19, 2026
తాబేళ్లను మొక్కుబడిగా సమర్పించే దేవాలయం!

అస్సాంలోని హజోలో మణికూట పర్వతంపై విష్ణుమూర్తి హయగ్రీవ రూపంలో పూజలందుకుంటారు. ఇక్కడి కోనేరులో భక్తులు తాబేళ్లను మొక్కుబడిగా సమర్పిస్తారు. తాబేళ్లను కూర్మావతారంగా పూజిస్తారు. బౌద్ధులు ఈ ప్రదేశాన్ని బుద్ధుడు మోక్షం పొందిన ‘మహాముని’ క్షేత్రంగా కొలుస్తారు. క్రీ.శ.1583లో నిర్మితమైన ఆలయ శిల్పకళా సౌందర్యం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. మధు, కైటభ రాక్షసులను విష్ణుమూర్తి ఇక్కడే సంహరించారని పురాణాల వాక్కు.


