News April 14, 2024
విజయవాడ: జగన్‌పై క్యాట్‌బాల్‌తో రాళ్లదాడి

విజయవాడలో సీఎం జగన్ చేస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర సింగ్‌నగర్‌లో జరుగుతున్న నేఫథంలో, జగన్ ప్రజలకు అభివాదం చేస్తుండగా కొందరు ఆగంతకులు పూలతోపాటు రాయి విసరడంతో జగన్ ఎడమ కంటికి గాయమైంది. క్యాట్‌బాల్‌లో రాయిపెట్టి విసరడంతో గాయం అయినట్లు సమాచారం. వెంటనే వైద్యులు ట్రీట్‌మెంట్ చేశారు. ఈ ఘటనలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గాయపడ్డాడు.
Similar News
News December 17, 2025
కృష్ణా: గొబ్బెమ్మల పూజలతో గ్రామాల్లో సంక్రాంతి సందడి షురూ

ధనుర్మాసం ప్రారంభమవడంతో గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ వాతావరణం మొదలైంది. మహిళలు మంచును సైతం లెక్కచేయకుండా తెల్లవారుజామునే ఆవు పేడతో సంప్రదాయ గొబ్బెమ్మలు తయారు చేసి, గృహాల ముందు ఏర్పాటు చేస్తున్నారు. రంగురంగుల ముగ్గులు, పూల అలంకరణలతో గొబ్బెమ్మలకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తుండడంతో గ్రామాలు కళకళలాడుతున్నాయి.
News December 16, 2025
కృష్ణాజిల్లా TDP అధ్యక్షుడిగా గురుమూర్తి.?

TDP కృష్ణాజిల్లా అధ్యక్షుడిగా వీరంకి వెంకట గురుమూర్తి పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. తోట్లవల్లూరుకు చెందిన గురుమూర్తి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈయన TDPలో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎదిగారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర గౌడ వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో అనేక పదవులను ఆయన సమర్థవంతంగా నిర్వర్తించారు.
News December 16, 2025
మచిలీపట్నం చేరుకున్న నారా లోకేష్

టీడీపీ యువ నాయకుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం మచిలీపట్నం చేరుకున్నారు. స్థానిక న్యూ హౌసింగ్ బోర్డ్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి కాంస్య విగ్రహావిష్కరణలో పాల్గొనేందుకు ఆయన మచిలీపట్నం చేరుకున్న లోకేష్‌కు 3 స్థంభాల సెంటర్‌లో మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో టీడీపీ, బీజేపీ కార్యకర్తలు స్వాగతం పలికారు.


