News April 25, 2025

విజయవాడ: జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ దారి మళ్లింపు

image

విజయవాడ మీదుగా విశాఖపట్నం(VSKP)- లింగంపల్లి(LPI) మధ్య ప్రయాణించే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు వెళ్లే మార్గంలో రైల్వే శాఖ మార్పులు చేసింది. సికింద్రాబాద్ స్టేషన్‌లో అభివృద్ధి పనులు చేస్తున్నందున నం.12805 VSKP- LPI ఏప్రిల్ 25 నుంచి, నం.12806 LPI- VSKP రైలు ఏప్రిల్ 26 నుంచి బేగంపేట, సికింద్రాబాద్‌లో ఆగదని, ఈ రైళ్లను ఆయా తేదీల నుంచి అమ్ముగూడ, చర్లపల్లి మీదుగా నడుపుతున్నామన్నారు.

Similar News

News March 7, 2026

నిప్పుల కుంపటిలా నాగర్ కర్నూల్

image

జిల్లాలో వేసవి ఆరంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో పెంట్లవెల్లి మండలం జటప్రోలులో అత్యధికంగా 38.5°C ఉష్ణోగ్రత నమోదైంది. యంగంపల్లి, తిమ్మాజీపేటలో 38.4°C, ఊర్కొండలో 38.2°C గా రికార్డయ్యాయి. భానుడి భగభగలకు జిల్లా ప్రజలు విలవిల్లాడుతున్నారు. మధ్యాహ్నం వేళ బయటకు వచ్చే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

News March 7, 2026

సివిల్స్ అభ్యర్థులకు రేవంత్ అభినందనలు.. BRSపై విమర్శలు

image

TG: సివిల్స్‌లో సత్తా చాటిన తెలుగు అభ్యర్థులకు CM రేవంత్ అభినందనలు తెలిపారు. ‘రాజీవ్ సివిల్స్ అభయ హస్తం’ ద్వారా సాయం పొందిన 20 మంది మంచి ర్యాంకులు సాధించడం సంతోషంగా ఉందన్నారు. ‘గత ప్రభుత్వం పేదల బిడ్డలు బర్లు, గొర్లు కాసుకొని బతకాలని భావించింది. మన ప్రభుత్వం వారి విద్యకు ప్రాధాన్యం ఇచ్చి IASలు, IPSలుగా ఎదగాలని తోడుగా నిలుస్తోంది’ అని ట్వీట్ చేశారు. వారు TG పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలన్నారు.

News March 7, 2026

ఫలితాలు విడుదల.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 89 మంది ఎంపిక

image

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 608 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల మెరిట్ జాబితాను తపాలా శాఖ విడుదల చేసింది. ఇందులో వనపర్తి డివిజన్ నుంచి 44, మహబూబ్ నగర్ డివిజన్ నుంచి 45 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఎంపికైన వారు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో మార్చి 23వ తేదీలోగా సంబంధిత డివిజన్ కార్యాలయాల్లో వెరిఫికేషన్‌కు హాజరు కావాలని అధికారులు సూచించారు.