News September 11, 2025

విజయవాడ: డయేరియాకి కారణం అదేనంట!

image

విజయవాడలో పదుల సంఖ్యలో ప్రజలు డయేరియా బారిన పడటం ఆందోళన కలిగించింది. అయితే, నీటి కాలుష్యం కారణం కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అక్కడ సేకరించిన నీటి శాంపిల్స్ పరీక్షల్లో నెగటివ్ రిపోర్టులు వచ్చాయి. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. ఇటీవల కాలనీ సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్ద జరిగిన అన్నదానంలో భోజనం చేసిన వారే ఎక్కువగా అస్వస్థతకు గురయ్యారన్నారు. కొందరు బయట ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చిందన్నారు.

Similar News

News December 12, 2025

ఎన్టీఆర్ జిల్లాలో నవోదయ పరీక్షకు సర్వం సిద్ధం

image

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్ష (JNVST-2026) కోసం ఎన్టీఆర్ జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,349 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. ఈ పరీక్ష డిసెంబర్ 13న ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జరుగుతుందని అధికారులు తెలిపారు. విద్యార్థులు కేటాయించిన కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని సూచించారు.

News December 12, 2025

అక్రమ మద్యంపై ఉక్కుపాదం: మంత్రి కొల్లు రవీంద్ర

image

విశాఖలో ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర 4 జిల్లాల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అధికారుల ఏడాది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. బెల్ట్ షాపులు, నాటు సారా, కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టాలని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని అధికారులకు స్పష్టం చేశారు.

News December 12, 2025

కృష్ణా: నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

image

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్ష (JNVST-2026) శనివారం జిల్లా వ్యాప్తంగా జరగనుంది. మొత్తం 17 కేంద్రాల్లో 1,894 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) యు.వి. సుబ్బారావు తెలిపారు. పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ వెల్లడించారు.