News April 25, 2024

విజయవాడ: డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కలిసిన సీపీ రామకృష్ణ

image

విజయవాడ పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి రామకృష్ణ నేడు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ.. విజయవాడలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సీపీకి సూచనలు చేశారు.

Similar News

News April 14, 2026

కృష్ణా: రేపే ఫలితాలు.. 49,579 మంది స్టూడెంట్స్ ఎదురు చూపు..!

image

ఇంటర్మీడియట్ ఫలితాలు బుధవారం ఉదయం 10:31 గంటలకు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రథమ సంవత్సరం 24,173, ద్వితీయ సంవత్సరం 25,406 మంది పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఫలితాల అనంతరం విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ధైర్యం చెప్పాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. ఫలితాలను Way2News యాప్‌లో చూసుకోవచ్చు.

MTM: ప్రభుత్వ కార్యక్రమానికి జనసేన డుమ్మా!

image

మచిలీపట్నంలో జరిగిన అంబేడ్కర్ జయంతి వేడుకలు రాజకీయ చర్చకు దారితీశాయి. ప్రభుత్వ కార్యక్రమాలకు జనసేన నేతలు గైర్హాజరు కాగా, మంత్రి కొల్లు రవీంద్రతో ఉన్న విభేదాల వల్లే వారు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. లక్ష్మీ టాకీస్ సెంటర్‌లో కూడా ఇరు పార్టీల నేతలు వేర్వేరుగానే నివాళులర్పించారు. పొత్తులో ఉన్నప్పటికీ సంస్థాగత విబేధాల కారణంగా నేతలు కలిసి పని చేయకపోవడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.