News January 23, 2025

విజయవాడ పోలీసులకు చంద్రబాబు అభినందనలు

image

విజయవాడ పోలీసు చర్యలను సీఎం చంద్రబాబు అభినందించారు. Suraksha For Safer Neighbourhoods చొరవ అభినందనీయమని కొనియాడారు. వెయ్యికంటే ఎక్కువ సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ప్రాముఖ్యత చాటుతోందని చెప్పారు. ఈ తరహా పోలీసింగ్ పరిపాలన ప్రజలకు మెరుగైన సేవ చేస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. హైటెక్ ఈగల్ వెహికల్స్ ప్రారంభించడం కూడా ఆయన అభినందించారు. 

Similar News

News February 19, 2025

పామర్రు యువకుడిపై కేసు నమోదు

image

పామర్రు మండలం పెదమద్దాలికి చెందిన ఓ యువకుడిపై కేసు నమోదైంది. ఎస్ఐ రాజేంద్రప్రసాద్ తెలిపిన వివరాల మేరకు.. మండలానికి చెందిన బాలికను యువకుడు వేణు వేధిస్తున్నట్లు మంగళవారం బాలిక తల్లి పామర్రు పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. అతడిని పలుమార్లు హెచ్చరించినా తన పద్ధతి మార్చుకోలేదని ఆమె చెప్పినట్లు వివరించారు. ఈ విషయమై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

News February 19, 2025

పమిడిముక్కలలో యాక్సిడెంట్.. యువతి మృతి

image

పమిడిముక్కల మండలం తాడంకి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి నర్రా లక్ష్మీ ప్రసన్న (20) అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు.. మచిలీపట్నానికి చెందిన లక్ష్మీ ప్రసన్న తాడిగడపలోని ఓ ప్రైవేటు కాలేజీలో బీసీఏ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడి బైక్‌పై ఆమె మచిలీపట్నానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టారు. సీఐ చిట్టిబాబు కేసు నమోదు చేశారు.

News February 18, 2025

గుడివాడ: కొడాలి నాని ఆసక్తికర్ వ్యాఖ్యలు

image

రెడ్ బుక్‌ గురించి తనకు తెలియదని, దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉండటం లేదన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘అధికారంలో ఉన్నప్పుడు యాక్టివ్‌గా ఉన్నాం. మా ఉద్యోగం పీకేశారు. ఇప్పుడు యాక్టివ్‌గా ఉండి ఏం చేయాలి’ అంటూ సెటైరికల్ ఆన్సర్ ఇచ్చారు. వంశీ అరెస్ట్ లాంటివి చిన్న చిన్న విషయాలని అన్నారు.

error: Content is protected !!