News May 7, 2025

విజయవాడ: ప్రధాని మోదీ పర్యటనపై సీపీ సమీక్ష 

image

అమరావతిలో మే నెల 2న అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లపై సీపీ రాజశేఖర్ బాబు పోలీస్ ఉన్నతాధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పలువురు వీఐపీలు విజయవాడ మీదుగా అమరావతికి వెళ్లనున్న నేపథ్యంలో పటిష్ఠ భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని సీపీ అన్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. పోలీస్ అధికారులు పాల్గొన్నారు. 

Similar News

News February 13, 2026

శివ నామాలు అర్థాలు ‘‘అర్ధనారీశ్వర’’

image

ప్రకృతి, పురుషుడు వేరు కాదని చాటిచెప్పే అద్భుత రూపమిది. లోక కల్యాణం కోసం శివుడు తన శరీరంలో సగభాగాన్ని పార్వతీ దేవికి ఇచ్చి ‘అర్ధనారీశ్వరుడు’ అయ్యాడు. కుడిభాగం శివుడు(పురుష తత్త్వం), ఎడమభాగం పార్వతి(స్త్రీ తత్త్వం). సృష్టిలో స్త్రీపురుషులు సమానమని, ఒకరిలో ఒకరు ఇమిడి ఉన్నారని ఈ రూపం తెలియజేస్తుంది. శక్తి లేనిదే శివుడు లేడు. శివుడు లేనిదే శక్తి లేదు అనే పరమ సత్యాన్ని ఈ రూపం ద్వారా మనం గ్రహించవచ్చు.

News February 13, 2026

607 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్

image

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్‌(NLCIL) 607 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్, ఐటీఐ అర్హత గల వారు ఫిబ్రవరి 25వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల కనీస వయసు 18 ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు స్టైపెండ్ రూ.11,040 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nlcindia.in

News February 13, 2026

వేసవి బీర సాగు.. ఇలా చేస్తే మేలు

image

తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడినిచ్చే పంట బీర. ఎన్.ఎస్-3, ఎన్.ఎస్-40, సురేఖ, జగిత్యాల లాంగ్, జైపూర్ లాంగ్ రకాలతో అధిక దిగుబడి పొందవచ్చంటున్నారు నిపుణులు. ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల కంటే తక్కువ ఉంటే బీరలో పూత, పిందె రాలే అవకాశం ఎక్కువ. 36 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే మగ పువ్వులు ఎక్కువగా వచ్చి దిగుబడి తగ్గుతుంది. అందుకే వేసవి బీర సాగును హరిత పందిర్లు కింద చేపడితే అధిక దిగుబడి వస్తుందంటున్నారు నిపుణులు.