News March 15, 2025
విజయవాడ: ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్

ఈ నెల 21వ తేదీన రెబల్ స్టార్ ప్రభాస్, శృతిహాసన్ నటించిన సలార్ చిత్రాన్ని విజయవాడలో రీ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం విజయవాడలోని 8 థియేటర్లలో రీ రిలీజ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. కాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలోని యాక్షన్ సీన్లు సినీ అభిమానులను ఉర్రూతలూగించాయి.
Similar News
News April 20, 2025
తిరుపతి: 22వ తేదీన జాబ్ మేళా

ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయం మోడల్ కెరియర్ సెంటర్ (MCC)AY 22వ తేదీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్యాలయ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. దాదాపు 14 కంపెనీల ప్రతినిధుల హాజరవుతారని తెలిపారు. పదోతరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ అభ్యర్థులు అర్హులన్నారు. మొత్తం 800 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.
News April 20, 2025
ఎల్&టీ సంస్థకు LOA అందించిన సీఆర్డిఏ కమిషనర్

అమరావతిలో శాసనసభ భవన నిర్మాణ పనులు చేసేందుకు L1గా ఎల్ & టీ సంస్థ ఎంపికైంది. ఈ మేరకు శనివారం విజయవాడలోని CRDA కార్యాలయంలో కమిషనర్ కె.కన్నబాబు ఎల్ & టీ సంస్థ ప్రతినిధులకు లెటర్ ఆఫ్ అవార్డు- LOA అందజేశారు. అమరావతిలో B+G+3 (బేస్‌మెంట్+ గ్రౌండ్+3) విధానంలో శాసనసభ భవనాలకు సంబంధించి రూ.617.33 కోట్ల పనులను ఎల్ & టీ చేపట్టనుంది.
News April 20, 2025
వరంగల్: ‘గిరికతాటి’ కల్లుకు కేరాఫ్ ‘పాకాల’

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గిరకతాటి కల్లు ఎక్కడ దొరుకుతుందంటే ఠక్కున గుర్తొచ్చేది ఖానాపురం మండలం పాకాల. నర్సంపేట నుంచి పాకాలకు వెళ్లే దారి మధ్యలో సుమారు 60 గిరికతాటి చెట్లు ఉన్నాయి. చుట్టూ దట్టమైన అడవి, పక్కనే పాకాల వాగు వద్ద దొరికే ఈ కల్లు కోసం HYD, WGL, ఖమ్మం, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ప్రతి ఏటా వేలం పాటలో గీతకార్మికులు ఈ చెట్లను దక్కించుకుంటారు. ఇక్కడ కుండ చికెన్ కూడా ఫేమస్.