News July 3, 2024
విజయవాడ: ప్రైవేటు ఆసుపత్రిలో కవలలు మృతి

విజయవాడ రూరల్ మండలం పడమటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బుధవారం తెల్లవారుజామున కవల పిల్లలు మృతి తీవ్ర కలకలం సృష్టించింది. గంగూరు సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ప్రశాంత్ సతీమణి బండ్రపల్లి మాధవి, ప్రైవేటు ఆసుపత్రిలో నిన్న ఉదయం కవల పిల్లలకు జన్మనిచ్చింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్ల కవలలు మృతి చెందినట్లు మాధవి బంధువులు ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News December 13, 2025
GNT: జాతీయ లోక్ అదాలత్‌లో 23,466 కేసుల పరిష్కారం

ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో ఒకేరోజు 23,466 కేసులు పరిష్కారం అయ్యాయి. గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో 17 బెంచీలతో కలిపి, జిల్లా వ్యాప్తంగా 53 బెంచీలు ఏర్పాటు చేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ చక్రవర్తి ఆధ్వర్యంలో 1,376 సివిల్, 21,415 క్రిమినల్, 578 చెక్ బౌన్స్, 97 ప్రీలిటికేషన్ కేసులలో రూ.57,68,57,572 ఇప్పించారు.
News December 13, 2025
మహిళల్లో మౌనం బలహీనత కాకూడదు: పెమ్మసాని

మహిళల్లో మౌనం బలహీనతగా మారిపోకూడదని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో, డీఆర్‌డీఏ సౌజన్యంతో తుళ్లూరులో శనివారం నిర్వహించిన ‘లింగ సమానత్వ జాతీయ ప్రచార కార్యక్రమం’ నయీ చేతన 4.0లో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ కూడా పాల్గొన్నారు.
News December 13, 2025
మంగళగిరి: సీఎం సభా ఏర్పాట్లు పరిశీలించిన హోం మంత్రి

మంగళగిరి APSP 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్‌లో ఈ నెల 16న కానిస్టేబుల్ ఉద్యోగాలకు నూతనంగా ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. శనివారం సభా ఏర్పాట్లను హోంమంత్రి అనిత.. డీఐజీ ఏసుబాబు, ఎస్పీ వకుల్ జిందాల్, బెటాలియన్ కమాండెంట్ నగేశ్ బాబులతో కలిసి పరిశీలించారు. అభ్యర్థులు వారి కుటుంబాలతో కలిసి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె చెప్పారు.


