News October 6, 2025

విజయవాడ బస్టాండ్‌లో గుండెపోటుతో వ్యక్తి మృతి

image

విజయవాడ బస్టాండ్‌లో ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందాడు. భార్యతో కలిసి గుంటూరు నుంచి మచిలీపట్నానికి వెళ్తున్న క్రమంలో 47వ ఫ్లాట్‌ఫామ్ వద్ద గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. లక్షలాది మంది ప్రయాణికులు వచ్చే బస్టాండ్‌లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రద్దీ కారణంగా అస్వస్థతకు గురవుతున్న వారిని పట్టించుకునే నాథుడే లేడని మండిపడ్డారు.

Similar News

News January 23, 2026

కృష్ణా: ఈ శాఖలో టెన్త్ అర్హతతో ఉద్యోగాలు

image

నిరుద్యోగ యువతకు భారతీయ పోస్టల్ శాఖ శుభవార్త తెలిపింది. దేశ వ్యాప్తంగా గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి 28,740 ఉద్యోగాలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌కు 1,215 పోస్టులు కేటాయించగా, మచిలీపట్నం డివిజన్ పరిధిలో 27 ఉద్యోగాలు ఉన్నాయి. రాత పరీక్ష లేకుండా, 10వ తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక జరగనుంది. దరఖాస్తులు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు స్వీకరించనున్నారు.

News January 23, 2026

సంగారెడ్డి: నేడే పరీక్ష.. హాజరు కాకుంటే ఫెయిల్

image

ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుక్రవారం (నేడు) నైతికత, మానవ విలువల పరీక్ష జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం తెలిపారు. ఈ పరీక్షకు ప్రతి విద్యార్థి తప్పనిసరిగా హాజరుకావాలని, గైర్హాజరైతే ఫెయిల్ అయినట్లుగా పరిగణిస్తామని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

News January 23, 2026

₹లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు: భట్టి

image

TG: మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాబోయే ఐదేళ్లలో మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలను అందజేస్తామని తెలిపారు. ‘ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడమే కాదు. ప్రతివారం బిల్లులు ఇస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు ఆలస్యం చేయకుండా ఇళ్లు నిర్మించుకోవాలి. బిల్లు చెల్లించే బాధ్యత మాది’ అని ఆసిఫాబాద్ జిల్లా జంగాంలో చెప్పారు.