News August 22, 2025
విజయవాడ రైల్వే డివిజన్ సమస్యల పరిష్కారానికి కృషి: MP

విజయవాడ రైల్వే డివిజన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు MP కేశినేని శివనాథ్ తెలిపారు. శుక్రవారం సికింద్రాబాద్‌లో జీఎం సంజయ్‌కుమార్‌ను కలిసి లెవల్ క్రాసింగ్ నం. 316, 147, 148, 8 వద్ద తక్షణం ROBs, RUBs నిర్మాణానికి టెండర్లు పిలవాలని కోరారు. అలాగే గేట్‌వే ఆఫ్ అమరావతిగా పేరుగాంచిన కొండపల్లి స్టేషన్‌ను అమృత్ భారత్ 2.0 కింద ఆధునీకరించాలని విజ్ఞప్తి చేశారు. జీఎం సానుకూలంగా స్పందించారు.
Similar News
News January 17, 2026
విశాఖకు రానున్న రాహుల్ గాంధీ.. ఎప్పుడంటే?

పార్లమెంటరీ రక్షణ కమిటీ చైర్మన్ రాధా మోహన్ సింగ్ నేతృత్వంలో ఎంపీల బృందం జనవరి 19 నుంచి మూడు రోజుల పాటు విశాఖలో పర్యటించనుంది. ఈ బృందంలో రాహుల్ గాంధీ, మహువా మోయిత్రా తదితరులు ఉన్నారు. వీరు ఎన్‌ఎస్‌టీఎల్ (NSTL)లో డీఆర్డీఓ ప్రాజెక్టులను, కోస్ట్ గార్డ్ తీరప్రాంత భద్రతను సమీక్షించనున్నారు. వీవీఐపీల రాక నేపథ్యంలో నగరం అంతటా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
News January 17, 2026
భక్తులకు పోలీసులు అండగా నిలవాలి: మంత్రి సీతక్క

మేడారంలోని వనదేవతల దర్శనానికి వచ్చే భక్తులకు పోలీసులు ధైర్యంగా నిలిచి, వారు ప్రశాంతంగా మొక్కులు చెల్లించుకునేలా చూడాలని మంత్రి సీతక్క సూచించారు. మేడారంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించిన ఆమె.. సీసీ కెమెరాలు, డ్రోన్ల పనితీరును పరిశీలించారు. భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని, ప్రతి అంశాన్ని అప్రమత్తంగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
News January 17, 2026
NLG: మేయర్ పీఠం సహా 9 పురపాలికలు మహిళలకే

ఉమ్మడి జిల్లాలో మేయర్ పీఠంతో పాటు 9 పురపాలికల ఛైర్‌పర్సన్ స్థానాలు మహిళలకే దక్కాయి. ఎస్సీలకు రెండు, బీసీలకు 3, జనరల్ 7, జనరల్ మహిళలకు 7 స్థానాలకు రిజర్వు చేశారు. బీసీలకు రిజర్వు చేసిన మూడింటిలో ఒక్కటి మాత్రమే జనరల్ కాగా రెండు మున్సిపాలిటీలు మహిళలకే రిజర్వు చేయడం విశేషం.


