News February 8, 2025
విజయవాడ: సీఎం చంద్రబాబును కలిసిన శాప్ ఛైర్మన్

శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు ఏపీ సెక్రటేరియట్‌లో సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. క్రీడాభివృద్ధి అంశాలపై చర్చించి, పెండింగ్‌లో ఉన్న క్రీడా ప్రోత్సాహకాల విడుదలకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే బడ్జెట్‌లో క్రీడలకు మరింత నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం సానుకూలంగా స్పందించి, ప్రణాళిక సిద్ధం చేస్తే త్వరలోనే కార్యాచరణ చేపడతామని హామీ ఇచ్చారు.
Similar News
News February 19, 2026
నెలసరికి ముందు ఇవి మేలు..

నెలసరికి ముందు ఆడవారి శరీరంలో అనేక మార్పులు వస్తాయి. వీటి వల్ల ఒళ్లు బరువుగా ఉండటం, కడుపు నొప్పి, రొమ్ముల సలపరం వేధిస్తాయి. దీన్నే ప్రీ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ అంటారు. ఈ లక్షణాలు తగ్గించడానికి డైట్‌లో డ్రైఫ్రూట్స్, మిల్లెట్స్, పెసలు, అలసందలు చేర్చుకోవాలి. శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్న ఆహారాలు, కూల్ డ్రింక్స్, కాఫీలు ఎక్కువగా తీసుకుంటే నెలసరి సమస్యలు మరింత పెరుగుతాయంటున్నారు నిపుణులు.
News February 19, 2026
వాట్సాప్‌లో ఇంటర్ హాల్ టికెట్స్

TG: ఇంటర్ హాల్ టికెట్ల డౌన్‌లోడ్ లింక్‌లను విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సాప్‌కు పంపినట్లు బోర్డు వెల్లడించారు. tgbie.cgg.gov.in సైట్ సర్వర్లు బిజీగా ఉంటే ప్రత్యామ్నాయంగా WhatsApp లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. సాంకేతిక సమస్యలుంటే కాలేజీ ప్రిన్సిపల్‌ను సంప్రదించాలని సూచించారు. హాల్‌టికెట్‌పై ఉన్న QR Code స్కాన్ చేస్తే ఎగ్జామ్ సెంటర్ లొకేషన్ చూపిస్తుంది. పరీక్షలు ఈనెల 25 నుంచి జరగనున్నాయి.
News February 19, 2026
ఇన్‌స్టా పరిచయం.. జార్ఖండ్ నుంచి బందరుకు వివాహిత

జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 30 ఏళ్ల వివాహిత సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి మాయలో పడి మచిలీపట్నానికి వచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భర్త, ముగ్గురు పిల్లలను వదిలి ఆమె వచ్చినట్లు సమాచారం. ఇక్కడికి వచ్చాక అతను దినసరి కూలి అని తెలుసుకున్న ఆమె మోసపోయానని గ్రహించింది. పోలీసుల జోక్యం, తల్లిదండ్రులు నచ్చజెప్పడంతో ఆమె తిరిగి ఇంటికి చేరుకుంది.


