News October 6, 2025

విజయవాడ: స్టార్టప్‌లకు రూ.1కోటి వరకు ఆర్థిక సహకారం

image

ఎనికేపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్(RTIH) స్టార్టప్‌లకు రూ.1కోటి వరకు ఆర్థిక సహకారం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆసక్తి ఉన్నవారు ఎనికేపాడు RTIH కార్యాలయంలో సంప్రదించాలని కోరింది. ఇన్నోవేషన్ పాలసీ, ఈక్విటీ ఫండింగ్‌ కింద స్టార్టప్‌లకు రూ.కోటి వరకు ఆర్థికసాయంతో పాటు కో వర్కింగ్ స్పేస్, మెంటర్‌షిప్, ట్రైనింగ్ తదితర సహకారం అందిస్తామని విజయవాడ RTIH తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.

Similar News

News January 16, 2026

విజయవాడలో దారుణం.. సహజీవనం చేస్తున్న మహిళ హత్య!

image

విజయవాడ కేదారేశ్వరరావుపేటలో దారుణం జరిగింది. శివ కుమార్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్న హుస్సేన అనే వివాహిత శుక్రవారం తెల్లవారుజామున హత్యకు గురైంది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే శివ కుమార్ ఆమెను హతమార్చి పరారైనట్లు సమాచారం. అజిత్‌సింగ్‌నగర్ సీఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

News January 16, 2026

NLG: రైతులకు అలర్ట్.. ఫార్మర్ రిజిస్ట్రీ లేకుంటే పథకాలు కట్

image

వ్యవసాయ ఆధునికీకరణలో భాగంగా ప్రభుత్వం ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ నమోదును తప్పనిసరి చేసింది. ఈ ఐడీ ఉంటేనే పీఎం కిసాన్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధి అందుతుందని అధికారులు తెలిపారు. ఉమ్మడి నల్గొండలో ఇంకా చాలా మంది రైతులు నమోదు చేసుకోకపోవడంతో ఏఈవోలు లేదా మీ-సేవా కేంద్రాలను రైతులు సంప్రదించాలని వారు సూచించారు. భవిష్యత్తులో పథకాలు పొందాలంటే ఈ నమోదు కీలకమని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.

News January 16, 2026

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావుకు బెయిల్ వస్తుందా?

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు, SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సిట్ ఇప్పటికే ఆయన్ను 14 రోజులపాటు కస్టడీకి తీసుకొని విచారించింది. ఇందుకు సంబంధించి నివేదికను ఈరోజు కోర్టులో సమర్పించనుంది. ఆయన్ను అరెస్ట్‌ చేసేందుకు అనుమతి కోరే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావుకు బెయిల్ వస్తుందా? లేదా అరెస్టుకు కోర్టు అనుమతిస్తుందా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.