News August 21, 2025
విజయవాడ: హైడ్రోజన్ బెలూన్ ద్వారా సరుకుల రవాణా

అమరావతిలో జరిగిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవంలో విజయవాడకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ హైడ్రోజన్ ఆధారిత ఎయిర్‌షిప్‌లను ప్రదర్శించింది. విజయవాడకు చెందిన డా. సీవీఎస్ కిరణ్, పి.శిరీష వీటిని రూపొందించారు. కిలో సరుకు రవాణాకు రూ.100 లోపు వ్యయంతో వీటిని 20-100 కి.మీ.ల దూరానికి ఉపయోగించవచ్చని వారు తెలిపారు. 2029నాటికి ఏపీలో ఈ సేవలు అందుబాటులోకి రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
Similar News
News January 23, 2026
ఒంగోలు మీదుగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్..!

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొత్తగా తాంబరం–సంత్రాగాచి–తాంబరం అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ (16107/16108) వారానికి ఒకసారి నడవనుంది. జనవరి 23 నుంచి తాంబరం నుంచి, జనవరి 24 నుంచి సంత్రాగాచి నుంచి సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ రైలు ఒంగోలు మీదుగా ప్రయాణించనుంది. ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందించనుందని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి.
News January 23, 2026
నిర్మల్: 101వ బర్త్‌డే జరుపుకున్న బామ్మ

నిర్మల్ జిల్లా దస్తురాబాద్‌కు చెందిన మారవేని గంగవ్వకు 101 వడిలో అడుగుపెట్టారు. దీంతో ఆమె కుటుంబీకులు గురువారం పుట్టిన రోజు వేడుకలు జరిపారు. గంగవ్వకు మొత్తం 9 మంది సంతానం. తన కొడుకులు, కుమార్తెలు, మనువళ్లు అంతా కలిసి మొత్తం 92 మంది ఉన్నారు. ఆమె 101 సంవత్సరంలో అడుగుపెట్టడంతో అంతా ఒక చోట కలిసి అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు.
News January 23, 2026
గవర్నర్‌కు ‘ఖమ్మం’ రుచుల విందు!

నేడు సూర్యాపేట జిల్లాకు రానున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కోసం ఖమ్మం వంటకాలు సిద్ధమవుతున్నాయి. నగరంలోని ‘అమ్మ మెస్’, ‘రెస్టిన్’ హోటల్ నిర్వాహకులు ఏకంగా 32రకాల శాకాహార వంటకాలతో మెనూ ఖరారు చేశారు. ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే పనసకాయ బిర్యానీ, పచ్చిమిర్చి టమాట పచ్చడి సిద్ధం చేస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారుల కార్యక్రమాలకు ఈ హోటల్స్ విందు అందించాయి.


